మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిసిన టీఆర్‌ఎస్ నేతలు

Sat,September 8, 2018 02:00 AM

జనగామ, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 07 : జనగామ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి టికెట్ ఖరారైన తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో శుక్రవారం జనగామ టీఆర్‌ఎస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ రద్దు తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలోనే ముత్తిరెడ్డికి చోటుదక్కడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. యాదగిరిరెడ్డిని కలిసిన వారిలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ గజ్జెల నర్సిరెడ్డి, నాయకులు ఉల్లెంగుల కృష్ణ, బక్క లక్ష్మణ్, ఉడుగుల కిష్ణయ్య, దామెర రాజు తదితరులు ఉన్నారు.

ముత్తిరెడ్డిని కలిసిన నర్మెట నాయకులు..
నర్మెట: జనగామ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖరారైన తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగరిరెడ్డిని శుక్రవారం నర్మెట పీఏసీఎస్ వైస్ చైర్మన్ పెద్ది రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎండీ, గౌస్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ చింతకింది సురేశ్ హైదరాబాద్‌లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ టికెట్ మళ్లీ ముత్తిరెడ్డికే కేటాయించడం హర్షణీయమన్నారు. వారి వెంట రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ డైరెక్టర్ ముద్దసాని పద్మజావెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల నాయకులు వంగ రామరాజు, రాజేశ్వర్‌గౌడ్ ఉన్నారు.

తరిగొప్పుల నాయకులు..
తరిగొప్పుల: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రం లో శుక్రవారం నిర్వహించిన ఆశ్వీరాద సభలో ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, తాజామాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని తరిగొప్పు ల మండల టీఆర్‌ఎస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం జరిగిన సభలో మండలంలో ని బొంతగట్టునాగారం,బొత్తలపర్రే,అంకుషాపూర్ గ్రా మాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేను కలిసిన వారిలో మండల నాయకులు అర్జుల సుధాకర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు రాజారాం, దామెర ప్రభుదాస్,తదితరులు పాల్గొన్నారు.

118
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles