ఒగ్గు కళా పితామహుడు చుక్కకు సన్మానం

Fri,August 4, 2017 12:15 AM

-వైభవంగా వందన ప్రదర్శనలు
- రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన శిష్య బృందాలు
-డోలు, ఒగ్గుకథలతో ఉర్రూతలూగిన మాణిక్యపురం
- రెండు నిమిషాలు ఒగ్గు కథ చెప్పి ఆకట్టుకున్న వైనం
- ఒగ్గు కళకు మరింత ప్రాచుర్యం తేవాలని సత్తయ్య పిలుపు
కలెక్టరేట్ : శివశివా.. హరోం హరా.. రావెరావె ఎల్లమ్మా డమడమ డప్పులు గొట్టంగా.. ఎయ్..ఎయ్ హో హో.. అర్రె..హో..హో.. లల్లల్ల ఏయ్..ఏయ్.. డిల్లెం బల్లెం అంటూ మాణిక్యపురం డొలు నృత్యాలు.. విన్యాసాలతో మార్మోగింది. ఒగ్గు కళా సామ్రాట్ డాక్టర్ చుక్కా సత్తయ్యకు రాష్ట్ర నలుమూలల్లో ఉన్న శిష్య బృందం ఘన సన్మానం చేసింది.. 87 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఇంటికి పరిమితమైన తమ ఆది గురువు చుక్కా సత్తయ్యకు బతికుండగానే తమ కళా ప్రదర్శనలు అంకితం ఇవ్వాలనే ఆశయంతో చేపట్టిన అభినందన వేడుకలు ఘనంగా జరిగాయి. సత్తయ్య స్వగ్రామం లింగాలఘన్‌పూర్ మండలంలోని మాణక్యపురం దీనికి వేదికగా నిలిచింది. గురువారం రాత్రి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, చండీశ్వర ఒగ్గుకళా సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కళా ప్రదర్శనల ఆంకిత కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. కాగా శిష్యుల అభిమానంతో భావోద్వేగానికి గురైన సత్తయ్య మాట్లాడారు. ఒగ్గు కళకు మరింత ప్రాచుర్యం వచ్చేలా పాటుపడాలని కోరారు. రాష్ట్ర ముఖ్య మ్రంతి కేసీఆర్ కళాకారుల అభ్యున్నతికి పాటుపడుతున్నాడని అన్నారు. ఆయన సహకారంతో ఒగ్గుకళను మరింత వ్యాప్తి చేయాలని అన్నారు. చిన్న చిన్న సమస్యలకు కుంగి పోవద్దని.. అందరూ ఐక్యంగా కళ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో రెండు నిమిషాలు ఒగ్గు కథ చెప్పి ఆకట్టుకున్నారు. 87 ఏళ్ల వయస్సులోనూ ఆయన స్వరం వినిపించడంపై ఆహుతులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర వ్యప్తంగా సుమారు 50 ఒగ్గు కథ బృందాలు, 5 డోలు బృందాలు వచ్చాయి. కాగా 10 బృందాలకు మ్రాతమే తమ విన్యాసాలను ప్రదర్శించే అవకాశం దక్కింది. మొత్తంగా కళాకారుల విన్యాసాలతో మాణక్యపురం మార్మోగింది.

కుర్చీలోనే తీసుకొచ్చిన శిష్యులు
చుక్కా సత్తయ్య నడవలేని స్థితిలో కుర్చీకే పరిమితం కాగా ఆయన్ను ఇంటి నుండి వేదిక వరకు ఆదే కుర్చీలో ఉంచి శిష్యులు మోసుకొచ్చారు. పల్లకీలో మొసుకొచ్చినట్లుగా సత్తయ్యను వేడుక వద్దకు తీసుకుని వచ్చారు. అనంతరం వేదికపై కూర్చోబెట్టిన శిష్య బృందాలు ఒకరి తరువాత ఒకరు వరుసగా వెళ్లి పాదాబివందనాలు చేసి ఆశీస్సులు తీసుకుని ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అనంతరం గ్రామస్తులు, నేతలు కూడా ఆయన కళను కొనియాడారు.

చుక్క సత్తయ్యకు కలెక్టర్ పరామర్శ
గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో భాదపడుతున్న ఒగ్గుకథా పితామహుడు చుక్క సత్తయ్యను గురువారం కలెక్టర్ శ్రీ దేవసేన పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీరప్ప కథను ఒగ్గు కళలో విలీనం చేసి కళకే వన్నే తెచ్చాడని, తన కళా ప్రదర్శనలతో ఎంతో మంది ప్రముఖులను మంత్రముగ్ధులను చేశారని, తన ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సొదరపెల్లి విజయ్‌బాస్కర్, ఒగ్గు కళాకార రాష్ట్ర సమన్వయ కర్త సొదరపెల్లి రవి, కళాకారులు కుమారస్వామి, అంజనేయులు పాల్గొన్నారు.కళాకారులు తమ కళా ప్రదర్శనల విన్యాసాలు చేసి అంకితమిచ్చి గురుపుజోత్సవం నిర్వహించు కళాబృందాలు మాణిక్యపురం కళాబృందం, బొల్లిరాజు కళాబృందం(జగిత్యాల), గాజర్ల శ్రీనివాస్ కళాబృందం(రాజన్న సిరిసిల్ల), ఒగ్గు దర్మయ్య బృందం(హైదరాబాద్), వీరన్న బందం(మహాబూబ్‌నగర్), వీరు భీమయ్య బృందం(ఆదిలాబాద్), పాలకుర్తి, బచ్చన్నపేట, ఇటిక్యాల పల్లి, కొత్తపల్లి కళాకారుల బృందాలు గురువారం సాయంత్రం నుంచి మాణిక్యపురంలో ప్రారంభించి శుక్రవారం ఉదయం వరకు ప్రదర్శనలు కొనసాగించి ఒక్కొక్క కళా ప్రదర్శన చుక్క సత్తయ్య అంకితమిస్తారు. ఈ ప్రదర్శనలో రాష్ట్ర నలుమూలల నుంచి 500 మంది పాల్గొననున్నారు.

132
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles