స్వామియే శరణమయ్యప్ప


Tue,December 10, 2019 12:56 AM

-కనుల పండువలా పడిపూజ మహోత్సవం
-వైభవంగా మండల కలశాభిషేకం, పదునెట్టాంబడి ఊరేగింపుగా స్వామివారి ఆభరణాలు తెచ్చిన దీక్షాపరులు
-తరలివచ్చిన భక్తులు


కోరుట్ల టౌన్‌ : ‘స్వామియే శరణమయ్యప్ప.. హరిహర సుతనే శరణమయ్యప్ప’ శరణుఘోషతో కోరుట్ల పట్టణం మార్మోగింది. స్థానిక శ్రీశబరీశా సేవా సమతి ఆధ్వర్యంలో సోమవారం అయ్యప్ప పడిపూజ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా పాలె పు రాముశర్మ వైధిక నిర్వహణలో గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, మణికంఠుడి ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మండల కలశాభిషేకం, పదునెట్టాంబాడి, పడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. దీక్షాపరులు పేటతుళ్లి ఆడు తూ, అయ్యప్ప సంకీర్తనలు, భజనలు, శరుణుఘోషతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కార్యక్రమంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చింత లక్ష్మీనారాయణ, గౌరవాధ్యక్షుడు దగ్గుల నరస య్య, అధ్యక్షుడు మిట్టపల్లి రాజశేఖర్‌, ఉపాధ్యక్షుడు రవి, శ్రీధర్‌, ప్రధాన కార్యదర్శి సాం బారు శ్యామ్‌ సుందర్‌, సహాయ కార్యదర్శులు కట్ట రమేశ్‌, రాచర్ల సునీల్‌, ప్రచార కార్యదర్శి వర్ల శ్రీకాంత్‌, భోగనవీన్‌, ప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు, దీక్షాస్వాములు పాల్గొన్నారు.

117

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles