అవినీతి నిర్మూలన వారోత్సవాల్లో విద్యార్థుల ప్రతిభ


Tue,December 10, 2019 12:54 AM

సారంగాపూర్‌ : బీర్‌పూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆడెపు వందన, జుంబర్తి శ్రావణి సోమవారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అవినీతి నిర్మూలను వారోత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చూపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అవినీతి నిరోదక శాఖ ఆధ్వర్యంలో అవినీతి నిర్మూలనలో యువత పాత్ర అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో బీర్‌పూర్‌ కశాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై కలెక్టర్‌ సర్పరాజ్‌ హమ్మద్‌, పోలీస్‌ కమిసనర్‌ కమలాసన్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ వేణు మాట్లాడుతూ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌, అద్యాపకులు, విద్యార్థులు పలువురు ఆడెపు వందన, శ్రావణిలను అభినందించారు.

55

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles