కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి


Tue,December 10, 2019 12:53 AM

జగిత్యాల రూరల్‌/మెట్‌పల్లి టౌన్‌ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో మంత్రి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సత్యనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది మూడు లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది ఆరు లక్షల మెట్రికట్‌ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలున్నాయనీ, కొనుగోళ్లు నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. అధిక దిగుబడి లారీల ద్వారా మిల్లులు నిండాయనీ, యజమానులు లోడ్‌ను వెనక్కి పంపకుండా చూస్తూ, రైతులకు మద్దతు ధర లభించేలా చూడాలని కోరారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ కేవలం జగిత్యాల జిల్లాకు సంబంధించి 600 లారీలు, 1.50లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని యాద్రాద్రి, మెదక్‌, సిద్దిపేట జిల్లాలకు పంపించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles