బో‘నమో’ మల్లన్న


Mon,December 9, 2019 12:18 AM

గొల్లపల్లి : మండలంలోని మల్లన్నపేట గ్రామం భక్తులతో కిక్కిరిసింది. షష్టి వేడుకల్లో భాగంగా గత సోమవారం మహాదండి వారంతో జాతర ప్రారంభం కాగా, కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆదివారం మల్లికార్జునుడికి ప్రీతికరమైన బోనాలను భక్తులకు నైవేద్యంగా సమర్పించి, మొక్కులు చెల్లించారు. కాగా, స్వా మి వారి దర్శనం కోసం ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో భక్తులు తరలిరాగా, భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చే శారు. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు స్పెషల్‌ క్యూలైన్లను ఏర్పాటు చేయగా భక్తులు స్వామి వారిని దర్శించుకొని, పట్నాలు వేసి, నిలువెత్తు బంగారం (బెల్లం) తులాభారం తో మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ప్రీతికరమైన గూడా న్నం, పరమాన్నం బోనాలు తీసి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శివసత్తుల ఆటలు, ఒగ్గు కళాకారుల డప్పుమోతలతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్‌ నర్సయ్య, ఆలయ ఫౌండర్‌ ట్రస్టీ శాంతయ్య చర్యలు చేపట్టారు. కాగా, స్వామివారిని సుమా రు 25వేల మంది భక్తులు దర్శించుకోగా పట్నాలు, ప్రత్యేక దర్శనం టికెట్ల విక్రయం ద్వారా ఆలయానికి రూ.53,550 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఫౌండర్‌ ట్రస్ట్‌ శాంతయ్య, ఈఓ శ్రీనివాస్‌ తెలిపారు. ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల డీఎస్పీ వెంకట రమణ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

62

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles