మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే


Mon,December 9, 2019 12:18 AM

మెట్‌పల్లి టౌన్‌: కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఆదివారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఘన స్వాగతం పలికారు. మెట్‌పల్లి పట్టణంలోని ఆయన నివాసంలో మంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా పలువురు మైనారిటీ, టీఆర్‌ఎస్‌ నేతలు ఈటలను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. డబ్బ గ్రామ సర్పంచ్‌ లింగంపల్లి గంగాధర్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మార్గం గంగాధర్‌, నాయకులు సోహెల్‌, షేక్‌ మహ్మద్‌, తలహా, షేక్‌ నవాబ్‌, ఎండీ జావిద్‌ పటేల్‌, అలీం, అమ్జద్‌, పిప్పరి రాజేశ్‌, లింగంపల్లి సంజీవ్‌, గజం రవికాంత్‌, గాజ చిన్న రాజన్న, గంగారెడ్డి, మెడిచెల్మెల ప్రవీణ్‌, సత్యనారాయణ ఉన్నారు.

58

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles