ఆడబిడ్డలకు మేనమామలా కేసీఆర్‌ కట్నం


Fri,December 6, 2019 12:49 AM

-కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్‌ నిరుపేద యువతులకు వరం
-ఆపదలో అండగా సీఎంఆర్‌ఎఫ్‌
-ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌
-జగిత్యాల అర్బన్‌, రూరల్‌ మండలాల్లో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీజగిత్యాల రూరల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆడబిడ్డలకు మేనమామలా మారి యువతుల వివాహాలకు ఆర్థికంగా సాయం చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పేరొన్నారు. జగిత్యాల రూరల్‌ తాసిల్దార్‌ కార్యాలయ ఆవరణలో గురువారం అర్బన్‌, రూరల్‌ మండలాల లరులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క ల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు నిరుపేద యువతులకు వరంగా మారాయన్నారు. 47 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి కింద రూ.47,05,452, షాదీ ముబారక్‌ ద్వారా 11మందికి రూ.11,76,276 చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలుస్తున్నదన్నారు. దిశా కేసులో నిందితులను 24గంటల్లో ప ట్టుకున్నారనీ, మహిళలు ధైర్యంగా ఉండాలన్నారు. మహిళలకు అండ గా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. అనంతరం జగిత్యాల రూరల్‌ తాసిల్దార్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ఆర్థిక సాయం అందుకున్న 62మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో చీరెలను పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, రూరల్‌ ఎంపీపీ గాజర్ల గంగారాం గౌడ్‌, అర్బన్‌ జడ్పీటీసీ సంగెపు మహేశ్‌, వైస్‌ ఎంపీపీ పాలెపు రాజు, తాసిల్దార్‌ దిలీప్‌ నాయక్‌, సర్పంచులు బోనగిరి నారాయణ, చెరుకు జాన్‌, దుమాల తిరుపతి, నాయకులు నలువాల లక్ష్మణ్‌, గిద్దె శంకరయ్య, బాల ముకుందం పాల్గొన్నారు.

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌
జగిత్యాల రూరల్‌ : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలంలోని అంతర్గాం గ్రామానికి చెందిన పొద్దుటూరి శంకరవ్వ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ను కలవగా ముందస్తు చికిత్స కోసం రూ.2లక్షల విలువ ఎల్‌వోసీని ఎమ్మెల్యే అందజేశారు. రాయికల్‌ మండ లం అల్లీపూర్‌కు చెందిన అనుమల్ల దుబ్బయ్యకు రూ.2.50లక్షల విలువ గల ఎల్‌వోసీని అందజేశారు. సారంగాపూర్‌ మండ లం రేచపల్లి గ్రామానికి చెందిన జుట్టు సాయి మహేశ్‌ ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కి దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ.36 వేల చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బండారి విజయ్‌, అల్లాల ఆనంద రావు, కొలగాని శేఖర్‌, పంబాల రాము, తోట ప్రభు, కూతురు శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోరా..?
అర్బన్‌: జగిత్యాల మున్సిపల్‌ పరి ధిలో పారిశుద్య నిర్వహణ అద్వానంగా ఉందనీ, ఎన్ని సార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోవ డం లేదనీ, పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్ప వని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ జగిత్యాల మున్సి పల్‌ పారిశుద్య అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. జగిత్యాల రూరల్‌ తాసిల్దార్‌ కార్యాలయంలో కల్యాణలక్షి చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ జగి త్యాల మున్సిపల్‌ పారిశుద్య విభాగం అధికా రులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్‌ పరిధిలో పారిశుధ్య ని ర్వహణ అధ్వానంగా ఉందనీ, రోడ్లు, డ్రైనీలు మొ త్తం మురికి, చెత్తాచెదారంతో నిండిపోయాయని అధికారులపై మండిపడ్డారు. మున్సిపల్‌ పరిధిలో ని పలు వార్డుల్లో మున్సిపల్‌ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌తో తాను స్వయంగా క్షేత్ర స్థా యిలో తిరు గుతూ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తీసేసి వా ర్డులను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని చెప్పినా పారి శుధ్య సిబ్బంది తీరు మారలేదనీ మండిపడ్డారు. ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా కనీస చ లనం లేదనీ, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న శాని టరీ జ వాన్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచిం చారు. వార్డుల్లోని పిన్‌పాయింట్ల వారీగా సమ యానుకూలంగా విధులు నిర్వహించాలన్నారు.

64

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles