వారం రోజుల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేయాలి


Fri,December 6, 2019 12:47 AM

పెగడపల్లి: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగం గా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు వారం రోజుల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని జిల్లా పరిషత్‌ సీఈఓ శ్రీనివాస్‌ ఆదేశించారు. జిల్లాలోని 380 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 25 పంచాయతీలకు ట్రాక్టర్‌ సౌకర్యం ఉండగా, మరో 25 జీపీలకు రెండు రోజుల్లో ట్రాక్టర్లు వస్తాయని తెలిపారు. గురువారం పెగడపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి భీమ జయశీల అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులతో సీఈఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 80 పంచాయతీ లు తమ వద్ద ఉన్న నిధులతో నగదు రూపేణా ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని ఆదేశించామనీ, పెగడపల్లి మండలంలో 8 పంచాయతీలు వెంటనే నగదు రూపేణా ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని తెలిపారు. జనాభా ప్రాతిపదికన అన్ని పంచాయతీలు 21 హెచ్‌పీ నుండి 44 హెచ్‌పీ సామర్థ్యం గల ట్రాక్టర్లు కొనుగోలు చేసుకోవచ్చనీ, తప్పని సరిగా అన్ని పంచాయతీల్లో కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. పంచాయతీ తీర్మానం మేరకు త మకు నచ్చిన ట్రాక్టర్‌ కొనుగోలు చేయొచ్చనీ, జిల్లాలో 10 కంపెనీలకు చెందిన 56 రకాల మోడళ్లకు చెందిన ట్రాక్టర్లు కొనుగోలు చేసుకొనే అవకా శం ఉందన్నారు. పూర్తి స్థాయిలో నిధులు లేని పంచాయతీలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామనీ, అన్ని బ్యాంకులు లోన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు ను రద్దు చేస్తామని ప్రకటించాయని వివరించారు. అన్ని పంచాయతీలు వెంటనే ట్రాక్టర్‌, టేలర్‌, ట్యాంకర్‌ కొనుగోలుకు వెంటనే ఏర్పాట్లు చేసుకోవాలని, పంచాయతీలు కొనుగోలు చేసే ట్రాక్టర్లకు ప్రత్యేక లోగోను ఏర్పాటు చేస్తామని, దీని వల్ల పంచాయతీ అవసరాలకు కాకుండా వేరె ఇతర పనులు చేస్తే, వెంటనే తెలిసిపోతుందని సీఈఓ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ భీమ జ యశీల, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

55

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles