ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు


Fri,December 6, 2019 12:47 AM

జగిత్యాల రూరల్‌ : ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటు గా ప్రభుత్వ పాఠశాలలు నిలుస్తున్నాయనీ, పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లా మూ డుసార్లు ముందంజలో నిలిచిందని కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్‌ మండలంలోని నర్సింగాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను గురువారం కలెక్టర్‌ సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ద్యార్థులు ఎలా చదువుతున్నారనీ, ఉపాధ్యాయు లు పాఠాలు ఎలా బోధిస్తున్నారనీ, విద్యార్థులు ఇంటికి ఎప్పుడు వస్తున్నారని కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉదయం పాఠశాలకు వచ్చి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్నారనీ, స్కూల్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు సమాధానమిచ్చారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉత్తేజం కార్యక్ర మం మూడేళ్ల నుంచి నిర్వహిస్తున్నామనీ, పదో తరగతి విద్యార్థులకు స్కూల్‌ ప్రారంభానికి ఒక గంట ముందు, స్కూల్‌ అనంతరం ఒక గంట ప్ర త్యేక తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారనీ, దీని కోసం విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్నాక్స్‌ ఇస్తు న్నారని తెలిపారు.


ఉత్తేజం కార్యక్రమానికి కావాల్సిన డబ్బును దాతల నుంచి లేదా విద్యార్థుల తల్లిదండ్రులైనా ఇవ్వవచ్చని తెలిపారు. ప్రతి పాఠశాలలో ప్రణాళికా ప్రకారం విద్యార్థులకు విద్యనందించడంతోపాటు దాతలు ఇచ్చిన డబ్బు బ్యాం క్‌లో జమ చేసి విద్యార్థులకు మాత్రమే ఖర్చు చే స్తారని తెలిపారు. జగిత్యాల అర్బన్‌ మండలం ధరూర్‌ పంచాయతీ పరిధిలోని రోడ్‌ సైడ్‌ ప్లాంటేషన్‌ను పరిశీలించి మొక్కలకు నీరు పోశారు. అనంతరం ఉత్తేజం కార్యక్రమానికి ఎం పీటీసీ మంగళారపు మహేశ్‌ రూ.15వేలు, దాత లు రూ.20 వేలు ఇవ్వగా మొత్తం రూ.35 వేలను కలెక్టర్‌ శరత్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ ఎంపీపీ మ్యా దరి వనిత, సర్పంచులు డెక్క ప్రభాకర్‌, సరోజన, ఎంపీటీసీ మంగళారపు మహేశ్‌, డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ, ఏపీవో గంగాలక్ష్మణ్‌, హెచ్‌ఎం రవీంద్ర పాల్గొన్నారు.

కలెక్టర్‌కు శుభాకాంక్షలు వెల్లువ..
జగిత్యాల, నమస్తే తెలంగాణ : టీఎస్‌ ఐపాస్‌ అమలులో జిల్లా మొదటి స్థానంలో నిలవగా, కలెక్టర్‌ శరత్‌ను గురువారం జిల్లా అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ బేతి రాజేశం, డీఆర్వో అరుణశ్రీ, ఎవో వెంకటేశ్‌, డీపీ ఓ శేఖర్‌, ట్రేజరీ అధికారులు, డీఆర్డీఏ లక్ష్మీనారాయణ పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం జిల్లా కార్యవర్గం, టీ రెవెన్యూ ఉ ద్యోగుల గౌరవ అధ్యక్షుడు హరి అశోక్‌ కుమార్‌, జిల్లా రెవెన్యూ అధ్యక్షుడు ఎండీ వకీల్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు, గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా మొక్కలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ వెంకటేశ్‌, చెలుకల కృష్ణ, తాసిల్దార్లు, నాయబ్‌ తాసిల్దార్లు, జిల్లా రెవెన్యూ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

52

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles