ఆపదలో అండ


Thu,December 5, 2019 03:25 AM

-అభాగ్యులకు భరోసా ఇస్తున్న సీఎంఆర్‌ఎఫ్‌
-కోరుట్ల నియోజకవర్గంలోఅత్యధిక మందికి సాయం
-ఎమ్మెల్యే కల్వకుంట్ల చొరవతో వెనువెంటే అందజేత
-గడిచిన ఆరేళ్లలో 2,720మందికి రూ.12.40కోట్ల పంపిణీ


మెట్‌పల్లి టౌన్‌: అత్యవసర సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఆర్థిక భరోసాను అందిస్తోంది. సీఎంఆర్‌ఎఫ్‌ (ముఖ్యమంత్రి సహాయనిధి) చెక్కుల పంపిణీలో కోరుట్ల నియోజకవర్గం ముందంజలో ఉంది. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రత్యేక చొరవ చూపుతుండడంతో రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంజూరు చేయించిన జాబితాలో కోరుట్ల నియోజకవర్గం ముందు వరుసలో ఉంది. ప్రతి నిత్యం సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులకు పలు సహకారాలను అందించడానికి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

నియోజకవర్గంలోని మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాల్లో ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియామకం చేసి సీఎంఆర్‌ఎఫ్‌ కొరకు ప్రయత్నించే నిరుపేదలకు అవసరమైన సహాయ సహకారాలను అందించే వసతి కల్పించారు. ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి దరఖాస్తుదారులకు అవసరమైన సహకారాలను అందిస్తున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ చికిత్సకు అవసరమైన నగదును చెల్లించలేక ఇబ్బందుల్లో ఉన్న పలు నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఆర్థిక భరోసాను అందిస్తోంది. దాదాపుగా ఆరేళ్లకాలంగా కోట్లాది రూపాయలు సీఎం సహాయనిధి కింద కోరుట్ల నియోజకవర్గంలోని నిరుపేదలకు అత్యవసర సమయాల్లో ప్రభుత్వం అందించింది.

రాష్ట్రంలోనే అత్యధికంగా...
రాష్ట్రంలోనే కోరుట్ల నియోజకవర్గంలో అత్యధికంగా సీఎంఆర్‌ఎఫ్‌ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి ముందంజలో ఉంది. గడిచిన ఆరేళ్లలో నియోజకవర్గంలో సుమారు 2,720 మంది లబ్ధిదారులకు సుమారు రూ.12.40 కోట్ల సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన నియోజకవర్గాల జాబితాలో కోరుట్ల సెగ్మెంట్‌ నిలుస్తోంది.


కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, తనయుడు, వైద్యుడు సంజయ్‌కుమార్‌ అడుగడుగునా ప్రత్యేక చొరవ చూపుతుండడంతో సీఎం సహాయనిధి చెక్కులు అందుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.12.40 కోట్ల మేర సీఎం సహాయనిధి చెక్కులను నియోజకవర్గంలోని మెట్‌పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ మండలాలతో పాటు కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ పరిధిలో సుమారు 2,720 మందికి అందజేశారు. రెండోసారి ఏర్పడిన ప్రభుత్వ హయాంలోనే సుమారు రూ.4.50 కోట్ల మేరకు సీఎం సహాయనిధి చెక్కులను మంజూరు చేయించారు.

37

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles