జగిత్యాల క్రైం : సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎస్పీ వెంకటరమణ కోరారు. బుధవారం జగిత్యా ల పట్టణంలోని కళాశాలలు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్స్ యజమానులతో డీఎస్పీ వెంకటరమణ సీసీ కెమెరాల ఏర్పాటు, ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.
సీసీ కెమెరాల ద్వారా కాలనీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరై నా కొత్త వ్యక్తులు సంచరించినా, చట్ట వ్యతిరేకమైన పనులు జరిగినా వెంటనే తెలుసుకోవచ్చన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటామని, పోలీసులకు సహకరిస్తామని యజమానులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ తదితరులు పాల్గొన్నారు.