సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి


Thu,December 5, 2019 03:19 AM

-ప్రభుత్వ వైద్యశాలల్లో 6250 ప్రసవాలు
-డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీధర్‌


పెగడపల్లి: జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్ర సవాల సంఖ్యను పెంచాలనీ, ఇప్పటివరకు ప్ర భు త్వ వైద్యశాలల్లో 6250 ప్రసవాలు జరిగినట్లు జి ల్లా వైద్య, ఆరోగ్య అధికారి పుప్పాల శ్రీధర్‌ పే ర్కొ న్నారు. బుధవారం పెగడపల్లి ప్రభుత్వ వైద్య ఆరో గ్య కేంద్రంలో నిర్వహించిన కుటుంబ ని యంత్ర ణ శిబిరంలో డీఎంహెచ్‌ఓ పాల్గొని 16 వేసెక్టమీ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ...జిల్లాలో మొత్తం 9,221 ప్రసవాలు కాగా, ప్రభుత్వ దవాఖానల్లో 6,250 నిర్వహించామనీ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, ప్రజల్లో పూర్తి అవగాహన పెరగడంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నదని వివరించారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1506 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగా, ఇందు లో 1132 ట్యూబెక్టమీ, 373 వేసెక్టమీ ఆపరేషన్లు చేశామన్నారు. అర్హులందరూ కు.ని ఆపరేషన్లు చే యించుకోవాలనీ, ఇందుకు గాను ప్రభుత్వం వేసెక్టమీకి రూ.1100, ట్యూబెక్టమీ ఆపరేషన్‌ చేయించుకున్నవారికి రూ.750 ప్రోత్సాహకం అందిస్తుందని తెలిపారు. సందర్భంగా జిల్లాలో చేపడుతున్న వైద్య సేవలు రాష్ట్ర స్థాయిలో రెండో స్థానం లో నిలవడంపై డీఎంహెచ్‌ఓ శ్రీధర్‌ను మండల వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి సుధాకర్‌, మెట్టుపల్లి వైద్యా ధికారి ప్రణవ్‌, ఇన్‌చార్జి సీహెచ్‌ఓ శ్రీనివాస్‌, సూపర్‌వైజర్‌ జనార్దనాచారి, హెల్త్‌ అసిస్టెంట్లు శ్రీకాంత్‌రెడ్డి, అశోక్‌, ప్రదీప్‌, రమణ, ఫా ర్మాసిస్ట్‌ భాస్కర్‌, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

22

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles