మనసున్న మారాజు కేసీఆర్‌


Thu,December 5, 2019 03:16 AM

-కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు భరోసా
-ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
-80 మందికి చెక్కుల పంపిణీ


రామడుగు : పేదింటి ఆడబిడ్డల పెండ్లికి పెద్దమనస్సుతో రాష్ట్ర సర్కార్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టిందనీ, సీఎం కేసీఆర్‌ మనసున్న మారాజు అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కొనియాడారు. మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. దీనిలో భాగంగా మండలంలోని 11గ్రామాలకు చెందిన 80 మంది లబ్ధిదారులకు రూ.90 లక్షల 10వేల 440 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఊరూ రూ తిరుగుతుండగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ నిరుపేద తండ్రి తన బిడ్డ పెండ్లి చేయాలని 50వేల నగదు తెచ్చి ఇంట్లో పెట్టగా ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకొని పెండ్లికి తె చ్చిన డబ్బులు పూర్తిగా కాలిపోయాయన్నారు.

ఆ సమయంలో ఆ నిరుపేదకు భరోసా కల్పించి తన బిడ్డ పెండ్లికి రూ.50వేలు అందించిన గొప్పవ్యక్తి కేసీఆర్‌ అని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన పాలనలో ఏ పేదింటి తండ్రి తన బిడ్డ పెండ్లికి బా ధపడకూడదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను తెచ్చి రూ.50,116ను అందించడం జరిగిందన్నారు. తర్వాత ఆ డబ్బులు కూడా సరిపోకపోవడంతో ఒకసారి 75 వేలు, ప్రస్తుతం లక్షా నూటపదహార్లను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 60ఏండ్లకు పైగా ఏలిన పాలకులు నిరుపేద బిడ్డల వివాహాలకు నయాపైసా కూడా విదల్చలేదన్నారు. ప్ర స్తుతం రామడుగు మండలానికి కోటి రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులు వచ్చాయన్నారు. మరో పదిరోజుల్లో మరో కోటి రూపాయల చెక్కులను లబ్ధి దారులకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత, జడ్పీటీసీ మార్కొండ లక్ష్మి, తాసిల్దార్‌ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో సతీశ్‌రావు, స ర్పంచ్‌ పంజాల ప్రమీల, ఎంపీటీ సీ బొమ్మరవేని తిరుమల, వైస్‌ ఎంపీపీ గోపాల్‌, ఏఎంసీ చైర్మన్‌ గంట్ల వెంకటరెడ్డి, విండో చైర్మన్‌ ఒంటెల మురళీకృష్ణారెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

26

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles