కలెక్టర్ గ్రీన్ చాలెంజ్


Wed,December 4, 2019 02:22 AM

-కరీంనగర్ కలెక్టర్ పిలుపుతో కలెక్టరేట్‌లో మొక్కలు నాటిన శరత్
-ఆరుగురు కలెక్టర్లు, కోరుట్ల ఎమ్మెల్యే , సబ్ కలెక్టర్‌కు చాలెంజ్


జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా మంగళవారం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ శరత్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్షికమంలో భాగంగా కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరించి, శరత్ ఐదు మొక్కలు నాటారు.

తిరిగి ఆయన నల్లగొండ, నిజామాబాద్, జోగులాంబ, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల కలెక్టర్లతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మెట్‌పల్లి సబ్ కలెక్టర్ గౌతంకు చాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రీన్‌చాపూంజ్ కార్యక్షికమానికి అనూహ్య స్పందన లభిస్తుందనీ, చాలెంజ్‌ను ప్రతి ఒక్కరూ స్వీకరంచి మొక్కలు నాటుతున్నారన్నారు. కార్యక్షికమంతో వాతావరణం సమతౌల్యంగా ఉంటుందనీ, 130 కోట్ల మంది ఐదు మొక్కల చొప్పున, 650కోట్ల మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని సంరక్షించుకోవచ్చన్నారు.

హరితహారం కార్యక్షికమంలో జిల్లాలో 45కోట్ల మొక్కలు నాటడంతో పాటు వంద మంకీఫుడ్ కోర్టులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హరితాహారంతో ప్రతి గ్రామంలో రూపురేఖలు మారాయనీ, పచ్చని చెట్లతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. డీఆర్డీఏ పీడీ లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఏఓ వెంక పాల్గొన్నారు.

67

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles