ఘనంగా దివ్యాంగుల దినోత్సవం


Wed,December 4, 2019 02:18 AM

గొల్లపల్లి : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మండలంలో ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ జమునాదేవి ఆధ్వర్యంలో మంగళవారం మల్లన్నపేట జడ్పీ పాఠశాల ఆవరణలో విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం ఆర్‌బీఎస్‌కే మెడికల్ ఆఫీసర్ పుల్లాడ్డి, నందయ్య దివ్యాంగుల తల్లిదంవూడులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు.


ఈ సందర్భంగా ఎంఈఓ జమునాదేవి మాట్లాడుతూ ఫిజియోథెరపీపై అవగాహన కల్పించారు. తల్లిదంవూడులకు పిల్లల విషయంలో ప్రేమగా ఉండాలని సూచించారు. ఎం శ్రీలత, సమత పాల్గొన్నారు.


పెగడపల్లి : మండలం కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో మంగళవారం దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ యా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, క్రీడా పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జడ్పీ పాఠశాల హెచ్‌ఎం ఎంఏ మజీద్ బహుమతులు అందజేశారు. కార్యక్షికమంలో ఉపాధ్యాయు లు సుబ్బారావు, తిరుపతి, సంపత్‌డ్డి, సీఆర్పీ జుంజురు రా జమల్లు, మల్లేశం, సంతోష, ఐఈఆర్టీ శ్రీలీల పాల్గొన్నారు.

66

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles