ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం..


Wed,December 4, 2019 02:17 AM

-కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
-కూప్‌సింగ్ కుంట వద్ద చిల్డ్రన్స్ పార్క్ సందర్శన


మెట్‌పల్లి టౌన్ : మెట్‌పల్లి పట్టణ ప్రజలకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామ ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని కూప్‌సింగ్ కుంట వద్ద రూ.కోటితో చేపడుతున్న చిల్డ్రన్ పార్క్ సుందరీకరణ పనులు పరిశీలించారు.

సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫౌంటైన్, ఫుట్‌పాత్ నిర్మాణం, గ్రీనరీ, చెట్ల పెంపకం, ఆట వస్తువులు, ఓపెన్ జిమ్‌ను సందర్శించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మెట్‌పల్లి ప్రజలకు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామనీ, పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకర్గ పరిధిలోని మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సిపాలిటీల పరిధిలో సుందరీకరణ పనులకు ఒక్కో పట్టణానికి రూ.50 కోట్లు మం జూరు చేసినట్లు గుర్తు చేశారు. ఇందులో కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలకు రూ.వంద కోట్లు కేటాయించగా, రూ.కోటితో మెట్‌పల్లిలో పార్కు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్షికమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, ఇంజినీర్ సాయి ప్ర ణీత్, టీవో నరేశ్, వర్క్ ఇన్‌స్పెక్టర్, రాజశేఖర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు మార్గం గంగాధర్, వన్నెల గంగారాం, మెట్‌పల్లి ఎంపీపీ మారు సా యిడ్డి, మాజీ ఎంపీపీలు రాజ్ మహ్మద్, చంద్రశేఖర్, మాజీ కోఆప్షన్ సభ్యుడు లింగంపల్లి సంజీ వ్, నాయకులు బర్ల సాయన్న, పూదరి నర్సాగౌడ్, ఏశాల రాజశేఖర్, పిప్పెరి రాజేశ్, ద్యావతి నారాయణ, రాజేశ్వర్‌గౌడ్, గాజె చిన్న రాజయ్య, బీమనాతి సత్యనారాయణ, తిరుసుల్ల అర్జున్, ఆనంద్‌గౌడ్, ఆకుల ప్రవీణ్, పుల్ల జగన్‌గౌడ్, ఆకుల ప్రవీణ్, ఒజ్జెల బుచ్చిడ్డి, ఎండీ జావిద్ పటేల్, టీఆర్‌ఎస్ మైనార్టీ నాయకులు సోహెల్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ షేక్ మహ్మద్‌తో పాల్గొన్నారు.

కల్యాణోత్సవంలో ఎమ్మెల్యే..
ఇబ్రహీంపట్నం: మండలం సత్తక్కపల్లి గ్రామం లో మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యం లో లక్ష్మీనృసింహస్వామి కల్యాణం వైభవంగా ని ర్వహించారు. వేదికపై ఉత్సమూర్తులను ప్రతిష్ఠించగా, వేద పండితులు చక్రపాణి మాధవచార్యుల వైదిక నిర్వహణలో శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన మంకీఫుడ్ కోర్టును ఎమ్మెల్యే పరిశీలించా రు. సర్పంచ్ ఆరేళ్ల లక్ష్మీరాజగౌడ్, ముదిరాజ్ సం ఘం నాయకులు మెండె దేవేందర్, లక్ష్మీనారాయణ, నర్సయ్య, శంకర్, నర్సాడ్డి, బోడన్న, నేమూరి లక్ష్మీనర్సయ్య, భక్తులు పాల్గొన్నారు.

మల్లెగుట్టపై వైభవంగా షష్టి ఉత్సవాలు

మల్యాల : మండల కేంద్రంలోని మల్లెగుట్టపై భక్తులు పట్నాలు వేసి, మల్లికార్జున స్వామి మొక్కులు చెల్లించారు. దండివారాన్ని పురస్కరించుకొని మల్లెగుట్టపైకి భక్తులు సోమవారం రాత్రి చేరుకొని ఆకాశంలో నక్షవూతాలు చూసి, ఆ తర్వాత పట్నాలు వేసి, బోనాలు వండి నైవేద్యం పెట్టారు. కాగా, మల్లెగుట్టకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నా సరైన రోడ్డు, విద్యుత్ సౌకర్యాలు ఇబ్బందులు పడుతున్నామనీ, పలువురు స్థానిక నాయకులు వసతుల కల్పనకు చొరవ చూపాలని పలువురు భక్తులు కోరారు.

55

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles