కొవ్వొత్తుల ర్యాలీ, ప్రార్థనలు


Mon,December 2, 2019 12:56 AM

జగిత్యాల, నమస్తే తెలంగాణ : షాద్‌నగర్‌ ఘ టనను ఖండిస్తూ ముంబైలో స్థిరపడ్డ తెలంగాణ వాసులు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కేసులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు అప్పగించాలనీ, దో షులను కఠినంగా శిక్షించాలనీ, నిర్లక్ష్యం వహించి న పోలీసులపై కఠిన చర్యలు తీ సుకోవాలన్నారు. కార్యక్రమంలో జీ ప్రమీల, మనోహర్‌, లలిత, గట్టు జ్యోతి, ఉల్లెంగ బాబు, పుష్ప, ఆనందు సు ధాకర్‌, భూషణం, సుజాత, గ్రేస్‌, ఎస్తేర్‌, సంధ్య, అమూల్య, అర్చితతో పాటు ముంబై తెలంగాణ బహుజన ఫోరం కన్వీనర్‌ గన్నారపు శంకర్‌, మంద రాజు, మహరాజ్‌, డీ బారతి, మూల్‌ నివాసి మాల పాల్గొన్నారు.


ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ
జగిత్యాల టౌన్‌ : షాద్‌నగర్‌ ఘటనను నిరసి స్తూ మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మె ల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అ ఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శి క్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు.
కథలాపూర్‌: షాద్‌నగర్‌ ఘటనలో మృతి చెం దిన యువతి ఆత్మకు శాంతి చేకూరాలని కథలాపూర్‌ మండలం భూషణరావుపేట చర్చలో క్రైస్తవులు ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వరంగల్‌ జిల్లాలో మానస హత్యకు గురికావడంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు గసికంటి సామ్యేల్‌, లక్ష్మీనారాయణ, ఫిలెమోన్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

70

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles