అమరవీరుల ఆశయాలను నెరవేర్చడమే ధ్యేయం


Mon,December 2, 2019 12:55 AM

చొప్పదండి ,నమస్తే తెలంగాణ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం ప్రాణాలర్పించిన అర్పించిన అమరవీరుల ఆశయాన్ని సాధించడమే ప్రభు త్వ ధ్యేయమనీ, ఆ దిశగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండలంలోని దేశాయ్‌పేటలో తెల ంగాణ అమరవీరుడు గుంట అశోక్‌ తొమ్మిదో వర్ధంతిని సర్పంచ్‌ గుంట రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అమరవీరుడు అశోక్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆనాడు కాంగ్రెస్‌, టీడీపీ ఇతర పార్టీల నాయకుల రెండునాలుకల ధోరణితో తె లంగాణ వస్తుందో రాదో అన్న బాధతో యువకు లు ఆత్మహత్య చేసుకున్నారనీ, తెలంగాణ అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వకుండా ఉండేందుకు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్‌ సంక్షేమపథకాలు ప్రవేశపెడుతున్నారనీ, అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచేందు కు ఇంటికో ప్రభుత్వ ఉధ్యోగంతోపాటు రూ.10లక్షల ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాలకు భ రోసా కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.


అమరవీరుడైన అశోక్‌ జ్ఞాపకార్థం అతడి సోదరుడు సర్పంచ్‌ గుంట రవి, కుటుంబసభ్యుల గ్రామస్తుల కోసం సిమెంట్‌ బేంచీలు సమకూర్చ డం, పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రొజెక్టర్‌కు స్క్రీన్‌ను బహూకరించడంతోపాటు గ్రామంలో ప్లాస్టిక్‌ నివారణే ధ్యేయంగా గ్రామంలోని ప్రతి ఇంటికీ జ్యూట్‌బ్యాగ్‌ను అందజేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం గ్రామస్తుల కు జ్యూట్‌ బ్యాగులు పంపిణీ చేసి, సిమెంట్‌ బేంచీలను ప్రారంబించారు. కార్యక్రమంలో జిల్లాగ్రంథాలయ చైర్మెన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చి లుక రవి, సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, గుడిపాక సురేశ్‌, పెద్ది శంకర్‌, ఎంపీటీసీ కూకట్ల తిరుపతి, ఉప సర్పంచ్‌ వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీపీ వెల్మ మల్లారెడ్డి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాం బయ్య, వార్డు సభ్యులు మోర వెంకటరమణ, జ క్కుల మధు, కొలిపాక మల్లేశం, చుక్క కార్తిక్‌, టీ ఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌, నాయకులు సుద్దాల శ్రీనివాస్‌, ఒడ్నాల మహిపా ల్‌, దుబ్బాక మల్లేశం, గంగస్వామి, ముదిగం టి అశోక్‌, వడ్లకొండ కొమురయ్య, మచ్చ రమేశ్‌, మామిడి రాజేశం, కళ్లెం రవీందర్‌రెడ్డి, గాండ్ల లక్ష్మ ణ్‌, ఏనుగు స్వామిరెడ్డి, కొత్తూరి రాజేందర్‌, బత్తిని సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles