కామాంధులను కఠినంగా శిక్షించాలి


Sat,November 30, 2019 01:06 AM

జగిత్యాల టౌన్: పశువైద్యురాలు ప్రియాంకడ్డిపై అ త్యాచారం చేసి హతమార్చిన కామాంధులను క ఠినంగా శిక్షించాలని జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పశుసంవర్థక శాఖ కార్యాలయ ఆవరణలో ప్రియాంకడ్డి చిత్రపటానికి పూలమాల వేసి పశుసంవర్ధక శాఖ వైద్యులతో కలిసి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల భద్ర త కోసం తెలంగాణ పోలీసు శాఖ హాక్-ఐ అనే యాప్‌ను తయారు చేసిందని, దానిని ప్రతి ఒక్క మహిళ తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని సూ చించారు. ఆపదలో ఉన్న మహిళలు ఈ యాప్‌ను క్లిక్ చేసినట్లయితే మీ వద్దకు పోలీసులు ప్రత్యక్షమవుతారన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో సా యంత్రం కొవ్వొత్తులతో ర్యాలీ తీసి నివాళులర్పించారు. ఈ కార్యక్షికమంలో జడ్పీ సీఈఓ శ్రీనివాస్, జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ జయకర్, ఏడీ డాక్టర్ శ్రీధర్, వెటర్నరీ డాక్టర్లు, పారా వెటర్నరీ ఉద్యోగులు, మినిస్టీరియల్ ఉద్యోగులు, అటెండర్లు పాల్గొన్నారు.
పశు వైద్యశాల విద్యార్థుల ర్యాలీ..
కోరుట్ల : పశువైద్యాధికారి ప్రియాంకడ్డిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలంటూ పీవీ నర్సింహారావు పశువైద్యకళాశాల విద్యార్థులు పట్టణంలో శుక్రవారం ర్యాలీ తీసి నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్థులు నంది చౌరస్తా నుంచి కొత్తబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ఆ మె ఆత్మకు శాంతి కల్గాలని నివాళులర్పించి మౌ నం పాటించారు. కాగా ప్రియాంకడ్డిని హత్యచేసిన దుండగులను ఉరి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్షికమంలో పశువైద్యకళాశాల విద్యార్థిని, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

89

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles