పేదలకు సీఎంఆర్‌ఎఫ్ వరం


Sun,November 17, 2019 01:57 AM

-చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
- రెండు మండలాల్లో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
- కొడిమ్యాల సర్వసభ్య సమావేశానికి హాజరు
- గ్రామ స్వరాజ్య స్థాపన, ప్లాస్టిక్ రహిత పల్లెల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు


మల్యాల : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల కు వరంలాంటి కార్యక్రమమని చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మల్యాల మం డలంలోని పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు వ్యాధులకు వివిధ ప్రైవేట్ దవాఖానల్లో శస్త్ర చికిత్సలు చే యించుకొని సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సాయం మంజూరు చేస్తార న్నారు. సీఎంఆర్‌ఎఫ్ పథకం పేద ప్రజలకు ఆపద లో ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని పేర్కొన్నా రు. ఈ సందర్భంగా మల్యాల కు చెందిన శివకుమార్‌కు రూ.16వేలు, కట్కూరి మల్లేశంకు రూ.48 వేలు, నూకపెల్లికి చెందిన లక్ష్మి కి రూ.23వేలు, సర్వాపూర్‌కు చెందిన భాగ్యమ్మ కు రూ.15,500, పోతారంకు చెందిన రాజమణికి రూ.18వేలు మంజూరు కాగా వాటికి సంబంధించిన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సభ్యుడు కొండపలుకుల రాంమోహన్ రావు, దండవేని రమేశ్, మల్యాల మండలానికి చెందిన నాయకులు పాల్గొన్నారు.

కొడిమ్యాల: ఆధికారులు అలసత్వం వీడి గ్రా మాల్లో పనులు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. శనివారం మం డల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో అధికా రులు నిత్యం పర్యటిస్తూ ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మరో సమావేశంలో జరగబోయే అభివృద్ది పనులపై చర్చ జరిగేలా చూడాలన్నారు. 2014 సంవత్సరానికి ముందు కొడిమ్యాల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మండలంలోని అన్ని గ్రామాల చెరువులను ఎల్లంపల్లి నీ టితో నింపామన్నారు. కరువు ప్రాంతం నుండి అభివృద్ధ్ది చెందుతున్న ప్రాంతంగా తీర్చదిద్దుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దే శానికే అదర్శంగా నిలుస్తుందన్నారు.

రాష్ట్ర ప్రభు త్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నారు. గ్రామ స్వరాజ్య స్థాపనకు, ప్లాస్టిక్ రహిత పల్లెల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపుని చ్చారు. 30 రో జుల ప్రణాళికలో అన్ని గ్రామాల్లో కరెంట్ సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలన్నా రు. అనంతరం ఎంపీపీ మేన్నేని స్వర్ణలత ఆధ్వర్యంలో తయారు చేయించిన జ్యూట్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ ప్రారంభించేలా తీర్మానం చేశారు. అంతకుముందు ఎం పీటీసీ సభ్యులు, సర్పంచులు పలు సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా ఎం పీటీసీలు లక్ష్మణ్, జగన్‌మోహన్‌రెడ్డి, అనుమాండ్ల రాఘవరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్ పలు సమస్యలను లేవనెత్తారు. ఈ సందర్భంగా ఎంపీపీ మా ట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పద్మావతి, ఎంపీడీఓ రమేశ్, మండల సర్పంచ్‌లు ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధి దారులకు రూ. 2 లక్షల 70 వేల సీఎంఆర్‌ఎఫ్ చె క్కులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శనివారం పంపిణీ చేశారు. కోనాపూర్ గ్రా మానికి చెందిన పూదరి జలపతి అనే వికలాంగు డు అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానాలో చికిత్స చేయించుకొని ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ. 42 వేలు మంజూ రయ్యా యి. ఆ చెక్కును ఎమ్మెల్యే స్వ యంగా వెళ్లి లబ్ధిదా రుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేన్నేని స్వర్ణలత, వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు నసీరుద్దీన్, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృ ష్ణారావు, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెన్నే ని రాజనర్సింగరావు, మండలాధ్యక్షుడు అనుమండ్ల రాఘవరెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

87

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles