అర్హత లేని వైద్యులపై చర్యలు


Sun,November 17, 2019 01:49 AM

రాయికల్ రూరల్ : ఎలాంటి విద్యార్హతలు లే కుండా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వై ద్యం చేస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై చర్య లు తీసుకుంటున్నట్లు జగిత్యాల జిల్లా టీబి వైద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. రాయికల్ పట్టణంలో ని ఆరు ప్త్రేవేటు ఆసుపత్రులను సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశాలమేరకు జిల్లా మలేరియా అధికారి శ్రీపతి, జిల్లా ఎన్‌సీడీ అధికారి సమీయొద్దీన్ ఆధ్వర్యంలో మూడు బృందాలు శనివారం తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడు తూ శ్రీమణి, జనతా, సంతోష్, స్వాతి, రవళి ద వాఖానతోపాటు కీర్తన మెడికల్ షాపును తనిఖీలు చేసేందుకు వెళ్లామన్నారు. జనతా దవాఖానలో నిబంధనలు పాటించకుండా రోగులకు వైద్యం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడనీ, వైద్యం తోపాటు సరైన డిప్లొమా లేకుండా నిర్వహిస్తున్న ల్యాబ్‌ను, దవా ఖానను సీజ్ చేసినట్లు తెలిపారు. మిగితా దవాఖానలు, కీర్తన మెడికల్ షాపు మూ సి ఉన్నాయని పేర్కొన్నారు. తాళం వేసి ఉండడం తో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు వీటిపై చ ర్యలు తీసుకుంటామని చెప్పారు. తనిఖీల్లో వైద్య సిబ్బంది సలీం , కడకుంట్ల భూమయ్య, మోసరపు సంతోష్, ఎస్‌ఐ ఆరోగ్యం, తదితరులు పాల్గొన్నారు.

60

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles