జాతీయ స్థాయి బాక్సింగ్‌కు గురుకుల విద్యార్థి


Sun,November 17, 2019 01:49 AM

మారుతీనగర్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఎస్‌జీఎఫ్ బాక్సింగ్ పోటీ ల్లో మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల కళాశాల విద్యార్థి కే శ్రీనివాస్ బంగారు పతకాన్ని సాధించినట్లు వ్యాయామ ఉపాధ్యాయులు రాజ్‌కుమార్, అఫ్సర్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీనివాస్ రాష్ట్ర స్థాయి అండర్-19 విభాగంలో బంగారు పత కం సాధించగా ఈ నెల 17 నుంచి ఢిల్లీ లో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో పా ల్గొననున్నట్లు వారు వివరించారు. శ్రీనివా స్‌ను ప్రిన్సిపాల్ మల్లికార్జునశర్మ, ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

43

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles