పచ్చదనంతో పాఠశాలలు కళకళ


Sat,November 16, 2019 01:40 AM

-పదిలో వందశాతం సాధించేందుకు కృషిచేయాలి
-డీఈఓ వెంకటేశ్వర్లు
-సారంగాపూర్ మండలం రంగపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీ
-ఉత్తేజం కార్యక్రమం ప్రారంభం
సారంగాపూర్ : పచ్చదనం పరిశుభ్రతతో ప్ర భుత్వ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు కళకళలాడుతున్నాయని డీఈఓ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని రంగపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇదే ఆవరణలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణల్లో చూసి మైమరచి పోయారు. ఇలాంటి పాఠశాలలు ఎక్కడ చూడలేదనీ, మంచి వాతావణం లో ఉన్న పాఠశాలకు వచ్చానని సంతోషం వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు దీటుగా రంగులతో తీర్చిదిద్దడంతో ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిభను తెలుసున్నారు. ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణల్లో డీఈఓ మొక్కలను నాటారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాయంత్రం ఉత్తేజం కార్యక్రమాన్ని డీఈ ఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కలెక్టర్ శరత్ ఆదేశాల మే రకు పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాల నే లక్ష్యంతో ఉదయం, సాయంత్రం ఉత్తేజం కా ర్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభు త్వ పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేం దుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూ చిం చారు. మూడేళ్లుగా వందశాతం ఉత్తీర్ణత సాధిస్తుండడంపై ఉపాధ్యాయులను అభినందించారు. వచ్చే ఏడాది సైతం వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా ఈ సందర్భంగా వారిని డీఈఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల వి ద్యాధికారి మద్దెల నారాయణ, ప్రజాప్రతినిధులు బెక్కెం జము, విమల, ఎస్‌ఎంసీ చైర్మన్ నాంపెల్లి, ప్రధానోపాధ్యాయుడు జయసింహారావు, పీఎస్ ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

68

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles