కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి


Sat,November 16, 2019 01:38 AM

గొల్లపల్లి : రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి, మద్దతు ధర పొందాలని ఎంపీపీ నక్క శంకరయ్య, జ డ్పీటీసీ గొస్కుల జలంధర్ సూచించారు. మండలం నందిపల్లి, తిర్మలాపూర్ పీడీ, లక్ష్మీపూర్ పీడీ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొ నుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కళ్లాల వద్దే ఆరబె ట్టి తేమశాతం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సర్పంచులు రమేశ్, ఎంపీటీసీ సభ్యులు లావణ్య జలపతి, కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అలీ, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్, ఏపీఎం త్రివేణి, సిబ్బంది, పాల్గొన్నారు.
కుల సంఘాల అభివృద్ధికి కృషి
కుల సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీటీసీ సభ్యుడు గొస్కుల జలందర్ అన్నారు. మండలం తిర్మలాపూర్ పీడీ గ్రామంలో ము న్నూరు కాపు సంఘ భవనంలో కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుల సంఘాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

36

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles