యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దు


Sat,November 16, 2019 01:38 AM

సారంగాపూర్ : యువత చెడువ్యసనాలకు బానిస కావద్దని బీర్‌పూర్ ఎస్‌ఐ శంకర్ నాయక్ సూచించారు. బీర్‌పూర్ మండలంలోని కండ్లపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆదేశాల మేర కు అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ సూచనలతో జగిత్యా ల రూరల్ సీఐ రాజేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పోలీస్ కళాబృంద సభ్యులు వివిధ అంశాలపై కళాజాత ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ గ్రామాల్లో యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దనీ, గంజాయి, మత్తు పదార్థాలకు దూరం గా ఉండాలని, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. ప్రజలు మూఢనమ్మకాలను నమ్మవద్దన్నారు. గ్రామాల్లోకి ఎవరైనా అనుమానిత, కొత్త వ్యక్తులు వస్తే విచారించి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈసందర్భంగా కళాజాత బృంద సభ్యులు ఈవ్ టీజింగ్, మద్యపాన నిషేదం, గల్ప్ చీటింగ్, ఎస్సీ, ఎస్టీ కే సులు, బాల్య వివాహాలు, మూడనమ్మకాలు, ప్రే మ వివాహలు, మత్తుపదార్థాలు, బ్యాంక్ మోసా లు, ట్రాపిక్ రూల్స్, సీసీ కెమరాలు, హెల్మెట్ వాడకం తదితర అంశాలపై కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పర్వతం రమే శ్, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

56

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles