మిషన్ భగీరథపై అలసత్వం వద్దు


Sat,November 16, 2019 01:38 AM

-ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చి కాంక్రీట్ ప్లాట్‌ఫాంలు నిర్మించాలి
-ఇంటి యజమాని, వార్డుమెంబర్లతో ధ్రువీకరణ తీసుకోవాలి
-అధికారులతో సమావేశంలో కలెక్టర్ శరత్
-30రోజుల ప్రణాళికపైనా సమీక్ష
జగిత్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో అమలవుతున్న మిషన్ భగీరథ పనులపై కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం అధికారులతో కలెక్టర్ శరత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పనుల్లో అలసత్వం చూపకుండా పకడ్బందీగా చేయాలనీ, ప్రతి గ్రామంలో వార్డుల వారీగా ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చి కాంక్రీట్ ఫ్లాట్‌ఫారం నిర్మించాలన్నారు. దీనికి సంబంధించి ఇం టి యజమాని, సంబంధిత వార్డుమెంబర్లతో కనెక్షన్ ఇచ్చినట్లుగా ధృవీకరణ చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో బల్క్ వాటర్ పైప్‌లైన్ ద్వారా వా టర్ ట్యాంకులకు కనెక్షన్ ఇచ్చి లీకేజీ లేకుండా ఉన్నట్లుగా సంబంధిత సర్పంచ్, సెక్రటరీ, మం డల పంచాయతీ అధికారులతో సంతకాలు తీసుకోవాలన్నారు.


ఇంట్రావిలేజ్ పైప్‌లైన్ పూర్తయినట్లుగా, ఇంటింటి కనెక్షన్లు గ్రామ పంచాయతీ వా ర్డుల వారీగా వార్డుల్లో ఎన్ని ఇళ్లున్నాయి?, ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు?, ఇంకా ఇవ్వాల్సినవి ఎన్ని? తదితర అంశాలపై గ్రామాల వారీగా తయారు చేసిన నివేదికపై గ్రామ సమైఖ్య ప్రెసిడెంట్, సర్పం చ్, గ్రామ సెక్రటరీ, వార్డు మెంబర్, మండల పం చాయతీ అధికారి, కాంట్రాక్టర్లతో కూడిన ధృవీకరణ సంతకాలు సమర్పించాలని ఆదేశించారు. గ్రామంలోని పాత ట్యాంకులకు ఏమైనా రిపేర్లు, రంగులు వేయాల్సి ఉంటే వాటిని 14వ ఫైనాన్స్ నిధుల నుంచి ఖర్చు చేయాలని మండల పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాం ట్రాక్టర్లు పనులు చేయపోతే వారిని తొలగించడానికి ప్రభుత్వ నిబంధనల మేరకు సిఫారసు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ నీటి సరఫరా ఆపరేటర్లను మిషన్ భగీరథ వారు ఉపయోగించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని మండల పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం, డీపీవో శేఖర్, మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

30రోజుల ప్రణాళికపై సమీక్ష
జిల్లాలో 30రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల పంచాయతీ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ 30రోజుల ప్రణాళికలో చేపట్టిన పనుల పురోగతిపై మాట్లాడుతూ మంకీ ఫుడ్ కోట్, రోడ్ సైడ్ ప్లాంటేషన్, 85శాతం మొక్కలను బతికించుకోవాలనీ, వాటిలో భాగంగా నాటిన మొక్కలకు ట్రీగార్డులు, వాటరింగ్ సరిగా ఉన్నా యా? లేదా పరిశీలించాలన్నారు. బ్లాక్ ప్లాంటేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నారా? లేదా పరిశీలించాలని మండల పంచాయతీ అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా కేజీ ప్లాస్టిక్‌కు, కేజీ బియ్యం ఇ స్తారనీ, బియ్యం గ్రామ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉం టాయనీ, ప్రతి గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామంకా వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మండల పంచాయతీ అధికారు లు తప్పక పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి గ్రా మంలో చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందు కు, మొక్కలకు నీటిని పోసేందుకు ట్రాక్టర్లు కొనుగోలు చే యాలని ఆదేశాలు జారీ చేశామనీ, త్వర లో అమలయ్యేలా మండల పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏ గ్రామంలోనైతే పనులు జరగడం లేదో వాటిని గుర్తించి పం చాయతీ చట్టంలో పేర్కొన్న విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం, డీపీవో శేఖర్, మండల పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

52

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles