అక్రమ లేఅవుట్ హద్దు రాళ్ల తొలగింపు


Sat,November 16, 2019 01:37 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ: ధర్మపురిలోని నక్కలపేట రోడ్డు, జగిత్యాల రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్లాట్ల అక్రమ లేఅవుట్‌లోని హద్దు రాళ్లను శుక్రవారం పట్టణ ప్లానింగ్ అధికారి వేణు, మున్సిపల్ మేనేజర్ చంద్రశేఖర్ తొలగించారు. ధర్మపురి మున్సిపల్ పరిధిలోని అక్రమ లేఅవుట్లలో ఉన్న పాట్లకు సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) కోసం ఇంతవరకూ దరఖాస్తులు చేసు కోని యజమానులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. వ్యవసాయ భూముల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్ల కు ఎల్‌ఆర్‌ఎస్ ఉంటేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇస్తామన్నారు. భూ యజమానులు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న దస్తావేజు విలువలో 14శాతం మాత్రమే పన్ను కడితే భవిష్యత్ లో ఎప్పుడైనా ఇంటినిర్మాణం చే సుకోవచ్చన్నారు. లేదంటే దస్తావేజు విలువ వందశాతం చెల్లించి అనుమతి పొందాల్సి వస్తుందన్నారు. జనవరి 13వరకూ ప్రభుత్వం ఈ అవకాశం కల్పించిందనీ, యజమానులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

51

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles