స్నేహితుడి కూతురు వివాహానికి చేయూత


Sat,November 16, 2019 01:37 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ: చిన్ననాటి స్నేహితుడి కూతురు వివాహానికి చిన్నతనంలో చదువుకున్న 1985 ఎస్సెస్సీ మిత్రబృందం సభ్యులు ముందుకువచ్చి ఆర్థిక చేయూతనందించి దగ్గరుండి వివాహన్ని జరిపించి స్నేహానికున్న విలువను చాటిచెప్పారు. ధర్మపురికి చెందిన నాగరాజు నాగేశ్వర్-శ్రీలత దంపతుల కూతురు వివాహం ఎల్లారెడ్డిపేటకు చెందిన యువకుడితో నిశ్చయమై శుక్రవారం జరిగింది. వివాహం నిశ్చయమైన నాటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నాగేశ్వర్‌కు చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచి మేమున్నామని దైర్యాన్నిచ్చారు. 1985 ఎస్సెస్సీ మిత్రబృందం సభ్యులు 40 మంది క లిసి నాగేశ్వర్ కూతురు వివాహానికి రూ.1.20లక్షలు సమకూర్చి అందజేశారు. వివాహ వేడుకలను దగ్గరుండి జరిపించారు. భోజనాలతోపాటు, పెళ్లి బట్టలు, ఇతర సామగ్రి కూడా అందజేశారు. మిత్రుల్లో ఒకరైన ఎస్సారార్ ఫంక్షన్‌హాల్ యజమాని ఎలగందుల నాగభూషణం పంక్షన్‌హాల్‌ను, టెంట్ సామగ్రిని ఉచితంగా అందజేశారు. వివాహాన్ని దగ్గరుండి జ రిపించిన మిత్రబృందాన్ని ధర్మపురి వాసులు ప్రత్యేకంగా అభినందించారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles