ఆరోగ్యమే మహాభాగ్యం


Fri,November 15, 2019 01:07 AM

-వ్యాయామం, నియమిత ఆహారంతో డయాబెటిక్ అదుపు
-నిత్య యోగాతో వ్యాధులు దూరం
-ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్


జగిత్యాల రూరల్ : మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యమనీ, నిత్య వ్యాయామం, నియమిత ఆహా ర అలవాట్లతో మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచవచ్చని జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్‌కుమార్ సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాలలోని కోదండ రామాలయ వాకర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో రామాలయ కల్యాణ మండపంలో ఉచిత మధుమేహ నిర్ధారణ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపులో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్ర ముఖ న్యూరాలజిస్ట్ సాయిరాం ఆసుపత్రి వైద్యు డు డా. రాము హాజరై ఉచితంగా డయాబెటిక్, బీపీ పరీక్షలను నిర్వహించి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మధుమేహ వ్యాధిగ్రస్తులకు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చైనా, భారత్ లాంటి దేశాల్లో అధిక శాతం మంది మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారన్నారు. ప్రతి వ్యక్తి ప్రతి ఆరు మాసాలకు ఒక సారి తప్పకుండా డయాబెటిక్ పరీక్షను చేయించుకోవాలన్నారు. మధుమేహ వ్యాధి గుండె, కిడ్నీలపై ప్రభావాన్ని చూపుతుందన్నారు. అధిక చక్కె ర, హై బీపీ పక్షవాతానికి దారితీస్తుందన్నారు.

మ ధుమేహ వ్యాధి రక్త నాళాలపై, రక్త ప్రసరణపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రక్తనాళాలపై చూపే ప్రభావం కంటి చూపుపై పడుతుందన్నా రు. నిత్య వ్యాయామం, నియమిత ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చన్నారు. దేశంలో ఇప్పటికే 8కోట్ల మంది డ యాబెటిక్ బారిన పడ్డారనీ, రానున్న ఐదు సంవత్సరాల్లో ఇది రెట్టింపయ్యే అవకాశం ఉందన్నారు. డయాబెటిక్ వల్ల డయాబెటిక్ రెటినోపతి, డబాబెటిక్ నెఫ్రోపతి లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు పాటిస్తే మదుమే హం దుప్ప్రభావాల బారి నుండి బయటపడవచ్చన్నారు. అనంతరం ఎమ్మెల్యేను వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కా ర్యక్రమంలో రామాలయం వాకర్స్ అసోసియేష న్ అద్యక్షుడు ఎనుగంటి రాంచంద్రం, ప్రధాన కా ర్యదర్శి గోపి, కోశాధికారి ప్రసాదరావు, డీఆర్‌డీఏ ఏపీడీ లక్ష్మీనారాయణ, హౌసింగ్ బోర్డు సభ్యులు మల్లారెడ్డి, రాంచంద్రారావు, సురేష్‌రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, తుంగూరు సురేష్, బ్రహ్మాండబేరి నరేష్, ప్రశాంత్ రావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాయామం, యోగాతో వ్యాధులు దూరం
జగిత్యాల లీగల్ : క్రమం తప్పకుండా వ్యా యామం, యోగా చేయడం ద్వారా వ్యాధులు దూరమవుతాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో గురువారం ఉద యం జగిత్యాల ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లీనిక్, జగిత్యాల జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్, జగిత్యాల మినీ స్టేడి యం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో వాకర్లకు ఉచితంగా షుగర్ పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోఉ వ్యాయామం, యోగాతో పాటు సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా బీపీ, షుగర్‌లను అదుపులో ఉంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం, ఆపి ప్రతినిధి మంచాల కృష్ణ, డెయిలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జగిత్యాల అధ్యక్షుడు బి బాలశేఖర్, ప్రధాన కార్యదర్శి టీవీ సూర్యం, ఉపాధ్యక్షుడు పుప్పాల అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ మాన్యం రవికుమార్, కోశాధికారి అనుమల్ల దేవరాజం, వాకర్లు తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ కోసం అంబేద్కర్ అలుపెరుగని పోరాటం
రాయికల్ రూరల్ : బడుగు బలహీన వర్గాల స్వేచ్చ కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి అంబేద్కర్ అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమా ర్ కొనియాడారు. రాయికల్ మండలం ధర్మా జీ పేట్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని గురువారం ఎ మ్మె ల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించేలా కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు. ప్రదాతల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు సూచించా రు. అనంతరం ధర్మాజీపేట్, చింతలూరు గ్రామా ల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారం భించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదు రుకాకుండా అన్ని వసతులు కల్పించాలని అధికా రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్య సంధ్య సురేందర్ నాయక్, జడ్పీటీసీ జా దవ్ అశ్విని, సర్పంచులు స్నేహ హరీశ్, అనుపు రం శ్రీనివాస్, పాలకుర్తి వేణు, టీఆర్‌ఎస్ మండ లాధ్యక్షుడు పడాల తిరుపతి, యువజన అధ్య క్షు లు ఎలిగేటి అనిల్, మోర రామ్మూర్తి, మోర హ న్మండ్లు, ఇంత్యాజ్, టీఆర్‌ఎస్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

58

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles