అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక


Fri,November 15, 2019 01:05 AM

మల్యాల : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలకు చెందిన విద్యార్థి రాకేశ్ గురువారం జగిత్యాలలో జరిగిన జిల్లాస్థాయి అండర్ 17 ట్రిపుల్ జంప్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించాడు. విద్యార్థి రాకేశ్ ఈ నెల 15న కరీంనగర్‌లో ని అంబేద్కర్ స్టేడియంలో జరిగే ఉమ్మడి జిల్లాస్థా యి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నట్లు మండల విద్యాధికారి అయిత శ్రీనివాస్ తెలిపారు. రాకేష్‌ను పాఠశాల పీడీ విశ్వప్రసాద్


జగిత్యాల రూరల్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి పోటీలకు జగిత్యాల మండలం కల్లెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు రాజమౌళి, పీఈటీ వెంకటలక్ష్మిలు గురువారం తెలిపారు. వారు మాట్లాడుతూ పోటీల్లో కల్లెడ పాఠశాలకు చెందిన విద్యార్థులు శ్రీనివాస్ అండర్ 14 విభా గం హైజంప్‌లో బంగారు పతకం సాధించాడన్నా రు. 600 మీటర్ల పరుగులో, డిస్కస్ త్రోలో వేణు సిల్వర్ మెడల్, లాంగ్‌జంప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడన్నారు. అండర్ 17డిస్కస్ త్రోలో రాకే ష్ సిల్వర్ మెడల్ సాధించి ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 15న జరగనున్న ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు.
రాయికల్ : జగిత్యాలలో గురువారం ముగిసిన ఎస్‌జీఎఫ్ క్రీడల్లో రాయికల్ మండలం భూపతిపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటా రు. మనోహర్ ట్రిబుల్ జంప్ , 200 మీటర్ల పరుగుపందెంలో రెండవ స్థానంలో నిలిచాడు.

పవిత్ర హైజంప్‌లో మొదటి స్థానం, రాజశ్రీ లాంగ్ జం ప్‌లో రెండో స్థానం, హారిక జూనియర్ విభాగం హైజంప్‌లో రెండో స్థానం సాధించి ఉమ్మడి క రీంనగర్ జిల్లా పోటీలకు ఎంపికయ్యారు.
జగిత్యాల లీగల్ : జిల్లా కేంద్రంలో ని మినీ స్టేడియం లో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీలకు పట్టణంలోని మా నస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థు లు ఎంపికైనట్లు ప్రి న్సిపాల్ బీ రజితా రావు తెలిపారు. అండర్ 14విభాగంలో వి నేహారెడ్డి మొదటి స్థానంలో, అండర్ 17విభాగంలో యాసిన్ ఉమర్ మూడో స్థానంలో నిలిచారని ఆమె తెలిపారు. ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్స్ 1500 మీట ర్లు, 400 మీటర్ల జిల్లాస్థాయి పోటీలకు జిల్లా కేం ద్రంలోని తెలంగాణ మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎండి యా సినొద్దీన్, సాయితేజ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ మహేందర్ గురువారం తెలిపారు.

56

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles