భూ పట్టా చేయాలని నిరసన


Fri,November 15, 2019 01:05 AM

మేడిపల్లి : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కమ్మరిపేటకు చెందిన పుప్పాల గంగు తమ భూమి పట్టా చేయాలని కుమారులతో కలిసి గురువారం మేడిపల్లి తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వారు చెప్పిన వివరాల మేరకు.. కమ్మరిపేటకు చెందిన పుప్పాల నడ్పి రాజం పేరు మీద సర్వే నంబర్ 920లో 0.35 గుంటలు, 895లో 0.12.5గుంటలు (ఎ1.10 గుంటలు, నలుగురి పొత్తు) ఉన్నది. పుప్పాల నడ్పి రాజం మృతి చెందడం తో ఈ భూమి మృతుడి భార్య గంగు పేరిట విరాసత్ చేయకుం డా రెండేళ్ల క్రితం అధికారులతో కలిసి పుప్పాల రాంరెడ్డి తన తం డ్రి పుప్పాల చిన్న రాజం పేరు మీద చేసుకున్నాడని గంగు ఆరోపించారు.


ఈ భూమిపై 2018 ఆక్టోబర్ 22న కలెక్టర్, సబ్‌కలెక్టర్, తాసిల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు గంగు తెలిపారు. తాసిల్దార్ మోఖాపైకి వచ్చి విచారణ చేయగా ఈ భూమి పుప్పాల నడ్పి రాజంకు చెందినదనీ, చుట్టు పక్కల పట్టాదార్లు చెప్పినట్లు గంగు తెలిపారు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగు చెందిన పుప్పాల గంగు తన కొడుకులతో కలిసి మేడిపల్లి తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లారు. తప్పుదోవ పట్టించినవారిని, తప్పుడు పట్టా చేసిన అధికారులను శిక్షించి తన పేరిట పట్టా చేయాలని నిరసన తెలిపారు. తాసిల్దార్ రాజేశ్వరి వచ్చి విచారణ చేపట్టి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో విరమించారు.

49

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles