చట్టాలపై అవగాహన పెంచుకోవాలి


Fri,November 15, 2019 01:05 AM

కోరుట్లటౌన్: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జూనియర్ సివిల్ జడ్జ్ పస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్యామ్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవిజ్ఞా న సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు అన్ని రకాల చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే బాధ్యత గల పౌరులుగా తయారు అవుతారని పేర్కొన్నారు. రాజ్యాం గం కల్పించిన హక్కులు, సైబర్ నేరాలు, సమాచార హక్కు చట్టం, కోర్టు, పోలీస్ స్టేషన్‌ల గురించి న్యాయమూర్తి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది కటుకం రాజేంద్రప్రసాద్, న్యాయవాదులు ఓటారికారి శ్రీనివాస్, ముబీన్‌పాషా, గొనె సదానంద్ నేత, ఆడెపు వినోద్, కడకుంట్ల సదాశివరాజు, రాజేశ్‌ఖన్నా, తోకల రమేశ్, కొంపెల్లి సురేష్, ప్రధానోపాధ్యాయుడు గడెల భూపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

34

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles