మత్స్యకారుల ఉపాధికి కృషి


Fri,November 15, 2019 01:04 AM

చొప్పదండి, నమస్తే తెలంగాణ : మత్స్యకారుల ఉపాధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. చొప్పదండి పట్టణంలోని కుడి చెరువులో గురువారం చేపలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్య సంపదను పెంచి, మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీమాంధ్ర ప్రభుత్వ పాలనలో కులవృత్తుల ఆధారపడ్డ వారు ఇతర దేశాలకు వలస వెళ్లారన్నారు. నేడు స్వరాష్ట్రంలో కులవృత్తులకు జీవం పోసి, అండగా నిలుస్తూ సంక్షేమ పథకాల ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఎంపీపీ చిలుక రవి, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మాజీ ఎంపీపీలు వె ల్మ మల్లారెడ్డి, ఒల్లాల కృష్ణహరి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్ పాల్గొన్నారు.

33

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles