రైతులు మద్దతు ధర పొందాలి


Wed,November 13, 2019 02:26 AM

పెగడపల్లి: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలని జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన నర్సింహునిపేట, నామాపూర్‌, ల్యాగలమర్రి, రాములపల్లి, బతికపల్లి, సుద్దపల్లి, దోమలకుంట, ఐతుపల్లి గ్రామాల్లో మండల టీ-సెర్ప్‌, కీచులాటపల్లి, ఎల్లాపూర్‌, నంచర్ల, రాంనగర్‌ గ్రామాల్లో నంచర్ల గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నంచర్ల సహకార సంఘం చైర్మన్‌ అమిరిశెట్టి లక్ష్మీనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధ్యానానికి మద్దతు ధరను కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా మండలంలోని 23గ్రామాల్లో 25 కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చూడాలని తీసుకోవడంతో పాటు, తూకంలో తేడాలు లేకుండా, వరుస క్రమంలో కొనుగోళ్లు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ గాజుల గంగాధర్‌, సెర్ప్‌ ఏపీఎం డి.సమత, సర్పంచులు నేరువట్ల బాబుస్వామి, ఇనుగాండ్ల కరుణాకర్‌రెడ్డి, ఉమ్మెంతుల వనజ, తోట గంగాభవాని, తాటిపర్తి శోభారాణి, నేరెళ్ల హారిక, బాల్సాని నిహారిక, జిట్టవేని కొండయ్య, రాచకొండ స్వప్న, ముద్దం అంజమ్మ, ఎంపీటీసీలు కొత్తపల్లి రవీందర్‌, మందపల్లి అంజయ్య, మీసాల గంగరెడ్డి, చింతకింది అనసూర్య, సింగసాని విజయలక్ష్మి, లచ్చయ్య, కో ఆప్షన్‌ సభ్యుడు రహీం, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, యూత్‌ అధ్యక్షుడు రాజు ఆంజనేయులు, నాయకులు గోలి సురేందర్‌రెడ్డి, నామ సురేందర్‌రావు, ఉమ్మెంతుల భాస్కర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, గంగాధర్‌, చిరంజీవినాయక్‌, ఆనందం, గంగరెడ్డి, ముద్దం మల్లేశం, నీరటి రాజ్‌కుమార్‌, ఉప సర్పంచులు చంద్రారెడ్డి, గంగాధర్‌గౌడ్‌, కోటగిరి గంగాధర్‌, పెద్ది సంతోష్‌, విష్ణువర్దన్‌, విండో సీఈవో రౌతు మధుకర్‌, దామోదర్‌, రాజు, సీసీలు చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపతి, రవి పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి
గొల్లపల్లి: రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకునీ, ధాన్యానికి మద్దతు ధర పొందాలని ఎంపీపీ నక్క శంకరయ్య, జడ్పీటీసీ గోస్కుల జలందర్‌ అన్నారు. మంగళవారం వారు శంకర్‌రావుపేట, మల్లన్నపేట, వెనుగుమట్ల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సహకార సంఘం పరిధిలో వెనుగుమట్ల, అబ్బాపూర్‌, తిరుమలాపూర్‌పీడీ గ్రామాల్లో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేయవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మాలని కోరారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విండో చైర్మన్‌ నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, సర్పంచులు రాజ్యలక్ష్మి, నర్సయ్య, పద్మ, రమేశ్‌, ఎంపీటీసీలు లక్ష్మి, రాజన్న, ఐకేపీ ఏపీఎం త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

56

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles