ఘనంగా కార్తీక పౌర్ణమి


Wed,November 13, 2019 02:26 AM

పెగడపల్లి: మండలంలో కార్తీక పౌర్ణమి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి, శ్రీ భక్త మార్కండేయస్వామి, ఆరవల్లి సత్యనారాయణస్వామి, వెంగళాయిపేట శివ-ఆంజనేయస్వామి, నామాపూర్‌, ఐతుపల్లి, ఎల్లాపూర్‌, నంచర్ల శ్రీ సీతారామచంద్రస్వామి, నంచర్ల శివాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఆలయాలు, నివాస గృహాల్లోని తులసి, ఉసిరి చెట్ల వద్ద దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.


రాజన్న ఆలయంలో ..
మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా మంగళవారం రాత్రి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయం లోపల, ఆవరణలో భక్తులు 5,116దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ జడల వెంకటేశం,

సభ్యులు పొనుగోటి శాంతపురావు, ఒరుగల రాజేశం, గం గుల కొమురెల్లి, కామాద్రి అరుణ్‌, జడల రాజేశం, మాదారపు కిషన్‌రావు, పొట్లపల్లి సాగర్‌రావు, తోట రాజు ఉన్నారు.
గొల్లపల్లి: మండల కేంద్రంలోని శివాలయంలో మంగళవారం దీపోత్సవవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాత్రి దీపోత్సవ కార్యక్రమం సందర్భంగా మహిళలు దీపాలను వెలిగించారు.

అంగన్‌ వాడీ కేంద్రాల్లో ..
మండలంలోని పలు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. తిర్మలాపూర్‌, లక్ష్మీపూర్‌ గ్రామాల్లో అంగన్‌ వాడీ కేంద్రాల్లో దీపాలను వెలిగించి వేడుకలు జరుపుకున్నారు. ఇందులో సూపర్‌వైజర్‌ మమత, అంగన్‌ వాడీ టీచర్లు హరిత, తిరుమల, చిన్నారులు పాల్గొన్నారు.

40

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles