ప్రతి ధాన్యపు గింజనూ కొంటాం


Wed,November 13, 2019 02:25 AM

మల్యాల: రైతు పండించిన చివరి ధాన్యపు గింజ నూ సైతం మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ స్పష్టం చేశారు. మల్యాల సహకార సంఘం పరిధిలోని మల్యాల, సర్వాపూర్‌, బల్వంతాపూర్‌, ముత్యం పేట గ్రామాల్లో, స్వయం సహాయక సంఘాల ప రిధిలోని మానాల, తక్కళ్లపెల్లి, తాటిపెల్లి, లంబా డిపల్లి, ముత్యంపేట, మల్యాల గ్రామాల్లో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మె ల్యే మంగళవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక రైతు కావడం వల్లే ప్రతి వారి కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టుబడి సా యం పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నార న్నారు. ఈ క్రమంలోనే ఎకరాకు రూ.10వేల చొ ప్పున అందజేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం కాపీ కొట్టి కిసాన్‌ సమ్మాన్‌ పేరిట ఒక్కో రైతుకు రూ.6వేల నిర్దిష్ట సహాయాన్ని అంద జేస్తుందన్నారు. రైతు పండించిన పంటల కోసం పలు ప్రాజెక్టులకు రూపకల్పన చేశామన్నారు.


రై తుకు మద్దతు ధర కల్పించేందుకే కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నామనీ, ప్రతి రైతు పం డించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్ర యించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అనంతరం ముత్యంపేట గ్రామ స్వ యం సహాయ సంఘాల సభ్యులు ఎమ్మెల్యేను స త్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సభ్యుడు రాంమోహన్‌రావు, ఐకేపీ ఏపీఎం రాజయ్య, స ర్పంచులు మిట్టపెల్లి సుదర్శన్‌, హన్మంతు యా దవ్‌, బింగి జ్యోష్ణ, గొడుగు కుమార స్వామి, బద్దం తిరుపతి రెడ్డి, గడికొప్పుల రమేశ్‌, నలువా ల లక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు దొంగ అనిత, కట్కూ రి నవత, మరాఠి సంజన, సహకార సంఘం అ ధ్యక్షుడు అడువాల సురేష్‌, మార్కెట్‌ కమిటీ చైర్మ న్‌ జనగాం శ్రీనివాస్‌, నేతలు గ డ్డం మల్లారెడ్డి, అయిల్నేని కోటేశ్వర్‌రావు, పొన్నం మల్ల య్య, త్రినాథ్‌, పోతురాజు శ్రీనివాస్‌, నలువాల బుచ్చ య్య, రాంలింగారెడ్డి, నేళ్ల రా జేశ్వర్‌రెడ్డి, అయి ల్నేని రాజేశ్వర్‌రెడ్డి, మ్యాక లక్ష్మణ్‌, వొ ల్లాల మల్లేశం గౌడ్‌, తోట అం జయ్య, రసమయి మల్లేశం, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు.

ఎమ్మెల్యేకు సత్కారం..
మల్యాల మార్కెట్‌ యార్డుకు మొదటిసారిగా వ చ్చిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను నూతనంగా నియమితులైన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనగాం శ్రీనివాస్‌ మంగళవారం సత్కరిం చారు. ఈ సందర్భంగా మార్కెట్‌ యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రాగా నూతన మార్కెట్‌ కమిటీ పాలక వర్గ సభ్యులు మొక్కను అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్ర మంలో మార్కెటింగ్‌ కార్యదర్శి శ్రీదేవి, నేతలు మిట్టపెల్లి సుదర్శన్‌, అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, నేళ్ల రా జేశ్వర్‌ రెడ్డి, పోతురాజు శ్రీనివాస్‌, ఆసం శివకు మార్‌, రమణ, సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

66

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles