పసుపు బోర్డు వచ్చేనా..?


Wed,November 13, 2019 02:25 AM

మెట్‌పల్లి,నమస్తేతెలంగాణ: పసుపు పచ్చ బంగారం అని పసుపు పంటను పిలుస్తుంటారు.. కానీ ఈ పంటను నమ్ముకున్న అన్న దాతకు మాత్రం పెట్టుబడి ఖర్చులు రాని దుస్థితి.. కారణం పం టకు కనీస మద్దతు ధర లేక పోవడం, షెర్‌ మార్కెట్‌ను తలపి స్తూ ధర అప్పుడే పెరిగినట్టుగా పెరిగి ఆమాంతం పడిపోవడం పరిపాటి. ధర అనుకూలించక పోతుందా అనే ఆశలతో వేలాది మంది రైతులు యేటా వానాకాలం కష్టమైనా, నష్టమైనా ప్ర ధాన పంటగా పసుపును సాగు చేస్తున్నారు. నిజామాబాద్‌ జి ల్లా ఆర్మూర్‌, బాల్కొండ, జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గాల్లో పసుపు పంటను ఎక్కువగా పండిస్తారు. ఈ సీజన్‌లో కోరుట్ల నియోజకవర్గ పరిధిలో సుమారు 15 వేల ఎకరాల్లో పసుపు పంట సాగవుతున్నది. ఆరు నెలల వ్యవధిలో పసుపు పంట చేతికి వస్తుంది. డిసెంబర్‌ ఆఖరు, జనవరి నెలలో చేతి కందుతుంది. దిగుబడి గడువు సమీపిస్తున్నా ఆరు నెలల కింద ట పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో అప్పటి, ప్రస్తుతం కేంద్రం లో అధికారంలో ఉన్న ఓ జాతీయ పార్టీకి చెందిన నేతలు పసు పు రైతుల డిమాండ్లను అస్త్రంగా చేసుకుని హామీలు గుప్పించా రు.


వారు అనుకున్నట్లే ఎన్నికల ఫలితం వచ్చి ఐదు నెలలు గడిచిన పసుపు బోర్డు ఏర్పాటు హామీ ఆచరణకు నోచుకోలే దు. నెలలు గడుస్తున్నా అతీగతి లేదు.. గిట్టుబాట ధర దేవుడె రుగూ మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదు. బోర్డు వస్తే గిట్టుబాటు ధర ఖాయమనుకున్న పంట సాగు రైతుల ఆశలు ఇక ఆవిరవక తప్పడం లేదు. ఈ సీజన్‌లో కూడా పసుపుకు మంచి రోజులు అనేవి ఇక అంతే సంగతులు అనే భావన మెజార్టీ రైతుల్లో ఏ ర్పడుతున్నది. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా ఉన్న పసుపునకు జాతీయస్థాయిలో ప్రత్యేక బోర్డు లేదు. సుగంధ ద్రవ్యాల బో ర్డులో పసుపు ఒక భాగం మాత్రమే. ఈ క్రమంలో పసుపునకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంలో కొన్ని సాంకేతిక కారణాల రీత్యా కేంద్రం సానుకూలంగా లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బోర్డు, కనీస మద్దతు ధరపై ఆశలు సన్నగిల్లుతుండగా అదే సమయంలో ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ. 5500 లోపు మాత్రమే ధర పలుకుతుండడం పంట రైతులను మరింతగా ఆందోళన కలిగిస్తోంది. పంట దిగుబడి సమయానికి ఇప్పుడున్న ధర కాస్త అయిన పెరుగుతుందా లేదా మరింతగా క్షీణిస్తుందా? అనేది చెప్పలేని పరిస్థితి.

127

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles