రైతులు అధైర్యపడొద్దు


Tue,November 12, 2019 03:06 AM

-ప్రతి ధాన్యపు గింజనూ సర్కారు కొంటుంది
-కొనుగోలు కేంద్రాల్లోనే సకల సౌకర్యాలు, మద్దతు ధర
-దళారులను నమ్మి మోసపోవద్దు
-ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
-కోరుట్ల, మల్లాపూర్ మండలాల్లో సెంటర్ల ప్రారంభం
-కల్లూరులో హరితహారం.. బేటీ బచావో, బేటీ పడావోపై ప్రతిజ్ఞ
-చిన్నమెట్‌పల్లిలో సంఘ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన


కోరుట్ల: ఆకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామనీ, రైతులు అధైర్య పడవద్దని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మండలంలోని ఏకీన్‌పూర్, సం గెం, నాగులపేట, చిన్నమెట్‌పల్లి, సర్పరాజ్‌పూర్, కల్లూరు, ధర్మారం గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధా న్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కేంద్రాల్లో రైతులకు మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనీ, దళారులకు ధాన్యాన్ని విక్రయించి మోసపోవద్దన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ తోట నారాయణ, వైస్ ఎంపీపీ చీటి స్వరూప, జడ్పీటీసీ సభ్యురాలు దారిశెట్టి లావణ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, సర్పంచుల ఫోరం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దారిశెట్టి రాజేశ్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖయ్యూం, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కాశీరెడ్డి మోహన్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సింగిల్ విండో అధ్యక్షులు, ఐకేపీ ఏపీఎం శంకర్, రైతులు, ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మండలంలోని కల్లూరు గ్రామంలో ప్రేరణ యూత్ సోషల్ అర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ సమతుల్యానికి మొక్కలు ఎంతో దోహదపడుతాయన్నారు. అనంతరం గ్రామస్తులకు వివిధ రకాల పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, వైస్ ఎంపీపీ చీటి స్వరూప, సర్పంచ్ వనతడుపుల అంజయ్య, ఉపసర్పంచ్ సంకె రాకేశ్, ఎంపీటీసీ సభ్యురాలు చిట్నేని లత, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, జిల్లా సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దారిశెట్టి రాజేశ్, నాయకులు చిట్నేని రమేశ్, కట్కం రాజరెడ్డి, గంగాధర్‌గౌడ్, జగన్‌రావు, ప్రేరణ యూత్ సభ్యులు తిరునగరి వెంకటరమణ, చారి, రమేశ్, మహేశ్, లక్ష్మీనారాయణ, రాజిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మండలంలోని చిన్నమెట్‌పల్లి గ్రామంలో రైతుమిత్ర ఐక్య సంఘం, యాదవ సంఘం భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఇందులో భాగంగా సంఘ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తోందన్నారు. అనంతరం గ్రామంలోని నవయువ యూత్ కార్యాలయాన్ని ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తోట నారాయణ, నూత్‌పెల్లి గంగరాజు, శ్రీనివాస్, పంచరి విజయ్‌కుమార్, కార్గూరి నర్సయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, జిల్లా సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దారిశెట్టి రాజేశ్, నాయకులు ముత్తయ్య, చంద్రశేఖర్, తిరుపతిరెడ్డి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఆడపిల్లలు ఇంటికి మణిహారం
ప్రతి ఇంటికి ఆడపిల్లలు మణిహారం లాంటి వారని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మండలంలోని కల్లూరు గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జాతీయ బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆడపిల్లలను చదివిద్దాం.. వారికి రక్షణగా నిలుద్దామని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తోట నారాయణ, వనతడుపుల అంజయ్య, సంకె రాకేశ్, చిట్నేని లత, చీటి వెంకట్రావ్, దారిశెట్టి రాజేశ్, చిట్నేని రమేశ్, కట్కం రాజరెడ్డి, గంగాధర్‌గౌడ్, జగన్‌రావు, ప్రేరణయూత్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
మల్లాపూర్: గ్రామీణ విద్యార్థులు చదువు, క్రీడలతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో కల్వకుంట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.15వేల విలువగల క్రీడా సామగ్రిని విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ హయాంలోనే విద్యా రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇప్పటికే అన్ని వసతులను కల్పించినట్లు తెలిపారు. అలాగే మండలంలోని ఐకేపీ, సింగిల్‌విండో ఆధ్వర్యంలో చిట్టాపూర్, ముత్యంపేట, మల్లాపూర్, కుస్తాపూర్, రాఘవపేట, మొగిలిపేట, నడికుడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కోనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కాటిపల్లి సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ కోటేశ్వర్‌రావు, ఐకేపీ ఏపీఎం రాజేశ్, ప్రిన్సిపాల్ అలీమొద్దీన్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, వైస్ ఎంపీపీ గౌరు నాగేశ్, సింగిల్‌విండో మాజీ చైర్మన్ కాటిపల్లి ఆదిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ ఏలేటి రాంరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు నారాయణరెడ్డి, లక్ష్మీనారాయణ, సాయికుమార్, కృష్ణవేణి, లక్ష్మి, లావణ్య, నాగరాజు, రుక్మా, రాజేశ్, లక్ష్మి, సత్తెమ్మ, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కల్వకుంట్లకు జన్మదిన శుభాకాంక్షలు
మెట్‌పల్లి టౌన్: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు జన్మదినం సందర్భంగా సోమవారం పలువురు టీఆర్‌ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసిన పుష్పగుచ్ఛం ఇచ్చినవారిలో పార్టీ మైనార్టీ నాయకులు సోహెల్, తలహా, షేక్ మహ్మద్, అన్వర్ ఉన్నారు.

ఎమ్మెల్యేకు ఆర్టీసీ జేఏసీ వినతి
కోరుట్లటౌన్: పట్టణంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును స్థానిక ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు కలిశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి పరిష్కారం దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు చీటి వెంకట్రావు, తోట నారాయణ, దారిశెట్టి రాజేశ్, పోగుల లక్ష్మీరాజం తదితరులున్నారు.

65

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles