కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు


Tue,November 12, 2019 03:04 AM

గొల్లపల్లి : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, మద్దతు ధర పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కటా రి చంద్రశేఖర్‌రావు అన్నారు. మండలంలోని చం దోలి, గోవిందుపల్లి గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగో లు కేంద్రాలను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు గ్రామస్థాయిలోనే ధాన్యాన్ని అమ్ముకునేందుకు వీలుగా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేసి, మద్దతు ధర అందిస్తున్నట్లు తెలిపారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ గోవిందుపల్లి సర్పంచ్ సత్తవ్వ, డైరెక్టర్ హనుమంత రెడ్డి, సీఈఓ ఎండీ హఫీజ్, నాయకులు మల్లారెడ్డి ఉన్నారు.


నేడు 12 కేంద్రాలు ప్రారంభం
పెగడపల్లి : మండలం నర్సింహునిపేట, నామాపూర్, ల్యాగలమర్రి, రాములపల్లి, బతికపల్లి, సుద్దపల్లి, దోమలకుంట, ఐతుపల్లి గ్రామాల్లో మండల సెర్ప్ ఆధ్వర్యంలో మంగళవారం వరి ధాన్యం కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ఏపీఎం సమత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీపీ గోలి శోభ, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు ప్రా రంభిస్తారనీ, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలని కోరారు. అలాగే నంచర్ల సహకార సంఘం ఆధ్వర్యంలో కీచులాటపల్లి, ఎల్లాపూర్, నంచర్ల, రాంనగర్ గ్రామాల్లో చైర్మన్ అమిరిశెట్టి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు సీఈఓ రౌతు మధుకర్ తెలిపారు.

50

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles