ధాన్యం ఆక్రమ తరలింపుపై నిఘా పెట్టాలి


Tue,November 12, 2019 03:03 AM

జగిత్యాల ప్రతినిధి , నమస్తే తెలంగాణ : ఖరీఫ్‌లో ధాన్యం ఆక్రమ తరలింపుపై నిఘా పెట్టాలని జి ల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు రా ష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగు ల కమలాకర్‌లు ఆదేశించారు. ఖరీఫ్ కొనుగోళ్ల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో బీఆర్కే భవన్ నుంచి వీడి యో కాన్ఫరెన్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మా ట్లాడుతూ మన రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. అందువల్ల రాష్ర్టానికి చత్తీస్‌ఘడ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ధాన్యం వచ్చే అవకాశం ఉ న్నందున అధికారులు ధాన్యంపై ఆక్రమ తరలింపుపై నిఘాపెట్టాలని సూచించారు. పండిన పంటలో 25 నుంచి 30 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలుకు నిర్ణయించిందనీ, కేంద్రం నిర్ణయం నేపథ్యంలో నిర్ణయించిన మేరకు మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి మద్దతుధరలో ఇబ్బంది రా కుండా తగిన చర్యలు తీసుకునేందుకు ఎప్పటికప్పుడు సమాచారం ప్రభుత్వానికి అందించాలన్నారు.


ఈ సారి ఒక్క గింజ కూడా ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి కాకుండా సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయం తో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోళ్లకు ముందు రైతుల వివరాలు నమోదు చేసుకుని వాటిని నాఫెడ్ ఈ పోర్టల్‌లో ఎంట్రీ చేయాలన్నారు. దీంతో రైతులకు సకాలంలో డబ్బులు చేతికి అం దుతాయన్నారు. జాయింట్ కలెక్టర్ బేతి రాజేశం మాట్లాడుతూ జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాల మంజూరు అయినాయని, అందులో 100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఖరీఫ్‌లో 6లక్షల 70మెట్రిక్ టన్నుల వరిధాన్యం వస్తుందనీ, అందుకు కావాల్సిన గన్నీ బ్యాగుల ఏర్పాటు, కొనుగోలు కేంద్రాలల్లో మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం జరిగిందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో హైదరాబాద్ నుం చి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి, విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టర్ రాజీవ్ త్రివేది, సివిల్ సప్లయి కమిషర్ సత్యనారాయణ రెడ్డి, మార్క్‌ఫెడ్ ఎండీ భాస్కరాచారి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జిల్లా నుండి అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి, పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్, డిఆర్డీడిఏ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

34

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles