గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర


Tue,November 12, 2019 03:03 AM

పెగడపల్లి : గ్రామాల అభివృద్ధిలో సర్పంచులదే కీలకపాత్ర అనీ, ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసం కృతజ్ఞతాభావంతో పని చేయాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో పెగడపల్లి, గొల్లపల్లి మండలలాలకు చెందిన సర్పంచులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్ర భుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచులకు అనేక అధికారాలు కట్టబెట్టిందని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృ ద్ధి పథంలో నడిపించాలని సూచించారు. గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైనందుకు గర్వపడుతూ, ఐదేళ్లపాటు పాటు గ్రామ అ భివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రణాళికాబద్దంగా, నిబద్ధతతో పని చేయాలని చెప్పారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అమలు చేసిన 30 రోజుల ప్రణాళిక ఒక అద్భుతమనీ, దీంతో గ్రామాల్లో పారిశుధ్యం అమలుతో పాటు, పచ్చద నం కార్యక్రమాలతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, ఇదే స్ఫూర్తితో గ్రామాల్లో స్వచ్ఛతా కొనసాగించాలన్నారు. అభివృద్ధి పనులకు ప్రతి నెలా ప్రభుత్వం రూ.339కోట్లను పంచాయతీల వారీగా మంజూరు చేస్తుందనీ, వాటిని పూర్తిస్థాయిలో సర్పంచులు సద్వినియోగం చేసుకుంటూ, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలన్నారు.


టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులుచైర్మన్ ఓరుగంటి రమణారావు, పెగడపల్లి, గొల్లపల్లి జడ్పీటీసీ సభ్యులు కాసుగంటి రాజేందర్‌రావు, గొస్కుల జలంధర్, ఎంపీపీ గోలి శోభ, నక్క శంకరయ్య, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, టీఆర్‌ఎస్ పార్టీ పెగడపల్లి మండలశాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ఇనుకొండ మోహన్‌రెడ్డి, నాయకులు ఉమ్మెంతుల భాస్కర్‌రెడ్డి, గోలి సురేందర్‌రెడ్డి, సాగి శ్రీనివాసరావు, బండి వెంకన్న, నామ సురేందర్‌రావు, రాచకొండ ఆనందం, బాల్సాని శ్రీనివాస్, బొడ్డు శంకర్, రెండు మండలాల సర్పంచులు పాల్గొన్నారు.

44

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles