గోదావరీ.. నమోనమః


Mon,November 11, 2019 01:46 AM

ధర్మపురి,నమస్తేతెలంగాణ : కార్తీక మాసం సందర్భంగా కార్తీక శుక్లపక్షం పదిహేను రోజుల పాటు నిర్వహించే గోదావరి హారతి కార్యక్రమం లో భాగంగా పదమూడో రోజైన ఆదివారం హార తి కార్యక్రమాన్ని కన్నులపండువలా నిర్వహించా రు. ఆలయ పక్షాన దేవస్థానం నుంచి సా యంత్రం వేళ వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల మధ్య మంగళవాయిద్యాలు వెంటరాగా అర్చకులు, సిబ్బంది, భక్తులు నది వద్దకు శోభాయాత్రగా వెళ్లారు. గోదావరి ఒడ్డున వేద బ్రాహ్మణులు సంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు చేసి హారతి పట్టారు. దేవస్థానం ఈఓ సంకటాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేశ్ శర్మ, ముత్యాల శర్మ, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, అర్చకులు బొజ్జ సంతోష్‌కుమార్, బొజ్జ రాజగోపాల్, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ దేవయ్య, వెంకటరవీందర్, తిరుపతి పాల్గొన్నారు. కాగా, మంగళవారం కార్తీకపౌర్ణమి రోజు కార్యక్రమం ముగియనున్నది.


క్షేత్రంలో భక్తుల రద్దీ
ధర్మపురి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. కార్తీకమాసంతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నదిలో స్నానాలాచరించి పురోహితులతో సంకల్పాలు చెప్పించుకున్నారు. అనంతరం గోదావరిలో కార్తీక దీపాలు వదిలారు. లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో పూజలు చేశారు.

ఏఎస్పీ పూజలు, కార్తీక ఏర్పాట్ల పరిశీలన
ధర్మపురి నర్సన్న సన్నిదిలో అడిషనల్ ఎస్పీ ద క్షిణామూర్తి స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఏఎస్పీకి దేవాలయ సిబ్బంది సాదర స్వాగతం పలికా రు. అనంతరం ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఈఓ శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, ప్ర సాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. అ నంతరం మంగళవారం జరిగే కార్తీక పౌర్ణమి వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. అవాంచనీయ ఘ టనలు జరుగకుండా ముఖ్య కూడళ్ల వద్ద, గోదావరి స్నానఘట్టాల వద్ద, దేవాలయం దగ్గర పోలీస్ సిబ్బందిని నియమించాలన్నారు. ఆయన వెంట సీఐ లక్ష్మీబాబు, ఎస్‌ఐ శ్రీకాంత్ ఉన్నారు.

42

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles