సీఆర్‌ఎంఎఫ్‌తో పేదలకు భరోసా


Mon,November 11, 2019 01:46 AM

గొల్లపల్లి : ముఖ్యమంత్రి సహాయ నిధితో నిరుపేదలకు ఆరోగ్యానికి భరోసానిస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొంది, ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు రూ.15వేలు ఆర్థిక సాయం మంజూరైంది. అలాగే ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన నెల్లి సరిత అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతుండగా రూ.లక్ష విలువైన ఎల్వోసీని మంత్రి ఈశ్వర్ ఆదివారం కరీంనగర్‌లోని ఆయన క్యాంప్ ఆఫీస్‌లో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో లేని వ్యాధులకు వివిధ ప్రైవేట్ దవాఖానల్లో శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యఖర్చులు చెల్లించలేని స్థితిలో ఉన్న వారికి ఎల్వోసీలు అందజేస్తున్నట్లు తెలిపారు.

30

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles