వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు


Mon,November 11, 2019 01:45 AM

కొడిమ్యాల : జిల్లాలోని ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో పలువురు గాయాల పాలయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కొడిమ్యాల మండలం న ల్లగొండ గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడని ఏఎస్‌ఐ గంగారాం తెలిపా రు. జగిత్యాల నుంచి వేములవాడకు వెళ్తున్న కారును ద్విచక్రవాహనంపై అటువైపు వస్తున్న పుప్పాల కనుకయ్య నల్లగొండ గ్రామ శివారు వద్ద ఢీకొట్టాడు. దీంతో కనుకయ్యకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు జగిత్యాల దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.


అయిలాపూర్‌లో ఆటో బోల్తా పడి..
కోరుట్ల : కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామ బైపాస్ రోడ్డులో ప్రమావశాత్తు ఆటో బోల్తాపడ్డ పడగా పలువురు స్వల్ప గాయాలు కాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ధర్మారం నుంచి ప్రయాణికులతో కోరుట్లకు ఆటోలో వ స్తున్న క్రమంలో అయిలాపూర్ ఎస్సీకాలనీ వద్ద ఇద్దరు ప్ర యాణికులను ఆటోలో ఎక్కించుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైపాస్ మలుపు వద్ద బోల్తాపడింది. ఇందులో పలువురు స్వల్ప గాయాలతో బయటపడగా, గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ విమలకు తీవ్ర గాయాలకు కాగా, చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు.

మల్యాల : నూకపల్లి అర్బన్ కాలనీ నుంచి మల్యాల బీసీ కాలనీకి వచ్చే రహదారిలో డీసీఎం వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన రాగిల్ల రమేశ్, భార్య రేణుక, కూతురు అఖిలతో రాయికల్ మండలం అల్లీపూర్‌కు వెళ్లి తిరిగి మద్దులపల్లికి వస్తుండగా మల్యాల వద్ద పెళ్లి బృందంతో వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్ట గా రమేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా, క్షతగాత్రులను జగిత్యాల దవాఖానకు తరలించారు.

34

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles