ఉద్యోగుల్లో మనోధైర్యం పెంచాలి


Mon,November 11, 2019 01:45 AM

జగిత్యాల టవర్ సర్కిల్ : అభద్రతాభావంతో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల్లో మనోధైర్యం పెంపొందేలా ప్రభుత్వం చొరవ చూపాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ కోరారు. ఆదివారం జిల్లా కేం ద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకం విజయవంతానికి రెవెన్యూ ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. కా ర్యాలయాలకు పోలీసు రక్షణ కల్పించి, సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగులపై జరుగుతున్న అసత్య ప్రచారాలతో పాటు, బెదిరింపు ఘటనలపై చర్య లు తీసుకుంటామని అడిషనల్ డీజీపీ హామీ ఇవ్వడంతో పాటు కామారెడ్డి ఆర్డీఓను బెదిరించిన ఎం ఆర్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంపై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ధరణిలోని అన్ని ఆప్ష న్లు తాసిల్దార్ లాగిన్‌లో ఉంటేనే పెండింగ్ పనులు పూర్తవుతాయనీ, పూర్తిస్థాయి సీసీఎల్‌ను నియమించడంతో పాటు ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. ఇక్కడ జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు ఎండీ వకీల్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బోగ శశిధర్, ఆర్డీవో కార్యాలయ ఏఓ దిలీప్, తాసిల్దార్ నవీన్, శ్రీనివాసరావు, కోమల్‌రెడ్డి, మధుగౌడ్, లక్ష్మణ్, తిరుమల్‌రావు, చెలుకల కృష్ణ ఉన్నారు.

33

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles