అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం


Sun,November 10, 2019 12:44 AM

-అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికి తెలంగాణే దిక్సూచి
-మహిళా సంఘాలకు రూ.619కోట్ల వడ్డీమాఫీ
-సాగు,తాగు నీరందించేందుకు విరివిగా ప్రాజెక్ట్‌లు
-చెరువులకు జలకళ తెచ్చేందుకు కాలువలకు తూములు
-ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
-సారంగాపూర్, బీర్‌పూర్‌లో కొనుగోలు కేంద్రాలు, అభివృద్ధి పనుల ప్రారంభం


సారంగాపూర్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశానికి తెలంగాణే దిక్సూచి అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం, వైకుంఠధా మం నిర్మాణం, శ్మశాన వాటిక నిర్మాణం, బీటీ, సీసీ రోడ్డు పను లు, చెరువులకు తూంల నిర్మాణాలకు జడ్పీ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా మ హిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మహిళ సం ఘాలకు 619కోట్లు వడ్డీ మాఫీ విడుదల చేసిందన్నారు. మహిళలకు ఇది శుభ దినమని పేర్కొన్నారు. రైతాంగానికి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం 270 ఉన్న కొనుగోలు కేం ద్రాలను 373 పెంచిందన్నారు. ప్రజలకు సుపరిపాలన అం దించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారనీ, రైతులకు ధా న్యం కొనుగొలులో ఇబ్బందులుంటే కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి సమస్యను వివరించవచ్చన్నారు. సంక్షేమం కో సం ప్రభుత్వం ఎంతో కృషి చే స్తుందన్నారు. తాగు, సాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రతి గ్రామం లో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత, తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ, సాగునీరు అందించేం దుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వరద కాలువల్లో నిండుగా నీరు ప్రవహిస్తుందనీ, దీని ద్వారా చెరువులు, కుం టలు నింపుతున్నామని అన్నారు. గ్రామాల్లోని కాకాతీయ కాలువలకు, చెరువులను నింపేందుకు తూంలు ఏర్పాటు చేస్తాన్నామని అన్నా రు. జగిత్యాల పరిధిలో చెరువులకు 176 తూంల ఏర్పా టు చేసినట్లు గుర్తుచేశారు. మండలంలోని తొంబరావుపేటకు 55లక్షలతో పెద్ద కెనాల్‌కు మాజీ ఎంపీ సహకారం తో తూం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సారంగాపూర్‌లోని చింతల చెరువుకు 46లక్షలు కేటాయించామన్నారు. ప్రాజెక్ట్ పరిధిలో భూములు కోల్పోతున్న వారికి రూ.16 కోట్లు ఇచ్చామన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని చింతల చెరువుకు లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేలా కృషి చేస్తుందన్నారు.

కార్యక్రమాల్లో సా రంగాపూర్, బీర్‌పూర్ ఎంపీపీలు కోల జమున, మసర్తి రమే శ్, జడ్పీ సభ్యులు మెడిపల్లి మనోహర్ రెడ్డి, పాత పద్మ, మం డల ఉపాధ్యక్షులు సొల్లు సురేందర్, బల్మురి లక్ష్మణ్ రావు, జిల్లా రైతు సమన్వయ స మితి సభ్యులు కొల్ముల రమణ, సింగిల్ విండో చైర్మన్లు ము ప్పాల రాంచందర్ రావు, సాగి సత్యం రావు, పాత రమేశ్, మండల రైతు సమన్వయ సమితి కన్వినర్లు కోల శ్రీనివాస్, రాజేశం, పార్టీ అధ్యక్షు లు గుర్రాల రాజేందర్ రెడ్డి, నారపాక రమేశ్, ప్రజాప్రతినిధులు ఆకుల జమున, బొడ్డుపెల్లి రాజ న్న, భుక్య సంతోష్, లక్ష్మి, రాజేశ్వరి, గుర్రాల రాజేందర్ రెడ్డి, గర్షకుర్తి శిల్ప, రిక్కల ప్రభాకర్, సృజ న, ప్రభాకర్, గుడిసే శ్రీమతి, ఆడెపు మల్లేశ్వరి, తాసిల్దార్లు నవీన్, దిలీప్, ఏపీఓ రాజేందర్, ఏపీఎంలు వోదెల గంగాధర్, రాజయ్య, ఎస్‌ఐ శంకర్ నాయక్, అధికారులు, మహి ళా సంఘాల సభ్యు లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

56

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles