నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ అండ


Sun,November 10, 2019 12:42 AM

ధర్మపురి, నమస్తే తెలంగాణ : ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమశాఖ మం త్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం కరీంనగర్‌లోని క్యాప్ కార్యాలయంలో ధర్మపురికి చెందిన వీ భీమరాజు అనే వ్యక్తికి సీఎంఆర్ ఎఫ్ నుంచి మంజూరైన రూ.1.50లక్షల విలువైన ఎల్‌ఓసీని అందజేశారు. భీమరాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం మంత్రి ఈశ్వర్‌ను ఆశ్రయించగా.. స్పందించి ఆయన రూ.1.50లక్షల ఎ ల్వోసీని అందజేశారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ అత్యవసర చికిత్స కోసం ద రఖాస్తులు చేసుకున్న పేదవారికి నేనున్నానం టూ ప్రభుత్వం సీఎంఆర్‌ఎప్ ద్వారా వైద్య ఖ ర్చులు చెల్లిస్తున్నదన్నారు. అలాగే ముందుగా దవాఖాన ఖర్చులు చెల్లించుకోలేని వారికి ఎల్వోసీలు అందజేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం ఆపదలో ఉన్న పేదలకు తక్షణమే సహాయం అందించేందుకు సచివాలయంలో ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేశారన్నారు. సహాయనిధికి దరఖాస్తులు అందిన వెంటనే అధికారులు వెరిఫికేషన్ పూర్తి చేసి, అందజేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ నాయకులు చీర్నేని నర్సయ్య ఉన్నారు.

47

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles