బాలల హక్కుల వారోత్సవాలు


Sun,November 10, 2019 12:42 AM

గొల్లపల్లి : మండలంలోని అంగన్‌వాడీ కేంద్రా ల్లో బాలల హక్కుల వారోత్సవాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పుట్టిన రోజు వేడుకలను శనివారం నిర్వహించారు. చిల్వాకోడూరు, గోవిందుపల్లి, బీబీరాజ్‌పల్లి, లక్ష్మీపూర్, ఆత్మకూ ర్, బల్వంతాపూర్, రాఘవపట్నం-1, 4, అబ్బాపూర్ అంగన్‌వాడీ కేంద్రాల్లో శనివారం పలు కా ర్యక్రమాలు నిర్వహించారు. రాఘవపట్నంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పుట్టిన రోజు వేడుకలు, అన్నప్రాసన, ఆత్మకూర్ ప్రైమరీ పాఠశాలలో పిల్లలకు వ్యాసరచన పోటీలు, చిల్వాకోడూరులో బా లల హక్కులు, ఆహారం, ఆరోగ్యంపై అవగాహన, అబ్బాపూర్‌లో అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించి చిన్నారులతో పలు ఆటలాడించారు. ద మ్మన్నపేటలో పాఠశాల విద్యార్థులు, అంగన్‌వాడీ చిన్నారులకు బెలూన్స్‌తో ఆటలాడించి, రాఖీలు కట్టించారు. చిల్వాకోడూరు పిల్లలు బెలూన్స్ ఎగురవేశారు. కార్యక్రమంలో సూ పర్‌వైజర్ మమత, అంగన్‌వా డీ టీచర్లు నర్మద, విజయ, గం గాభవానీ, లాల్‌బీ, లలిత, రజిత, వసంత, సరోజన, రమాదేవి, జలజ, సాయిలత, స్వరూప, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.ధర్మపురి రూరల్ : మండలంలోని జైన గ్రా మంలో శనివారం బాలల హక్కుల పరిరక్షణ వా రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భం గా గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో స్థానిక అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం విఠళేశ్వర్, అంగన్‌వాడీ టీచర్లు పద్మ, స్వరూపారాణి, వనజ, రమ, విజయలక్ష్మి, పాల్గొన్నారు.

75

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles