వడ్డీ మాఫీపై మహిళల హర్షాతిరేకం


Sun,November 10, 2019 12:42 AM

సారంగాపూర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ సం ఘాలకు రూ.619కోట్లు వడ్డీ మాఫీ మంజూరు చేయడంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సారంగాపూర్ మండల కేం ద్రంలో సీఎం చిత్రపాటానికి మహిళా సంఘాల సభ్యులు, ప్ర జాప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నా రు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రావల్సిన వడ్డీమాఫీని విడుదల చేయడం అభినందనీయమన్నా రు. ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎంపీపీ, జడ్పీటీసీ, ప్రజాప్రతినిధులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కా ర్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీ సభ్యుడు మేడిపల్లి మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సోల్లు సురేంధర్, మండల కోఆష్సన్ సభ్యుడు అమీర్, సర్పంచ్ గుర్రాల రాజేందర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు మానాల సహస్రమా ల, మార్కెటింగ్ డీపీఎం మల్లేశ్, తాసిల్దార్ నవీన్, ఏపీఎం వోదెల గంగాధర్, ప్రజాప్రతినిధులు, సెర్ప్ సీసీలు, వీఓఏలు, మహిళా సంఘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

43

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles